వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు : రామ్‌చరణ్ | Ram Charan, Varun Tej, Pragya Jaiswal at Kanche Audio Launched | Sakshi
Sakshi News home page

వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు : రామ్‌చరణ్

Published Sat, Sep 19 2015 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు : రామ్‌చరణ్

వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు : రామ్‌చరణ్

‘‘ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నాను. ఒకరోజు కథ ఉందంటే, చెప్పమన్నాను. ఫస్టాఫ్ చెప్పాడు. సెకండాఫ్ చెప్పలేదు. మరి.. ఆ కథతోనే ఇప్పుడు వరుణ్‌తో సినిమా తీశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తీస్తే మాత్రం క్రిష్ అయిపోతాడు(నవ్వుతూ). మా ఫ్యామిలీలో వరుణ్ అందగాడు. హైట్‌పరంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలా ఉన్నాడు. వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు.
 
  వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన చిత్రం ‘కంచె’. బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆవిష్కరించి, నిర్మాత అల్లు అరవింద్‌కి ఇచ్చారు. ‘‘ప్రపంచంలో ఎన్ని ఫార్ములాల్లో సినిమాలు వచ్చినా వార్ బ్యాక్‌డ్రాప్‌కి లవ్ స్టోరీ మిక్స్ అయిన సినిమా పెద్ద హిట్ అవుతుంది.
 
  నేను చేయాలనుకున్న కథను క్రిష్ చేశాడు’’ అని ఈ చిత్రంలో ఓ పాత్ర చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్నారు. నటుడిగా వరుణ్‌లో ఉన్న ఇంటెన్సిటీ ట్రైలర్‌లో కనిపించిందని అల్లు అరవింద్ చెప్పారు. అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని వరుణ్ తేజ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తీశానని క్రిష్ చెప్పారు. గొప్ప పాటలు రాసే వీలు చిక్కిందని సిరివెన్నెల, అద్భుతమైన సినిమాకి పని చేశానని సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. నాగబాబు, సి. కల్యాణ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement