
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంతకాలం సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉండేవాడు. ఇకనుంచి మహేష్ బిజినెస్ రంగంలో కూడా బిజీకానున్నాడు. తాజాగా మహేష్ ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. అది వేరే విషయం అనుకోండి.అయితే ఈ మల్టీప్లెక్స్‌ను చూసిన ప్రతిఒక్కరూ వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టుందే అని ఆశ్చర్యపోతున్నారట.
అయితే ఏ విషయమైనా సరే.. తన శైలిలో స్పందించే రామ్‌గోపాల్ వర్మ.. మల్టీప్లెక్స్ మహేష్‌లా అందంగా ఉందని డిఫరెంట్‌గా కామెంట్ చేశాడు. అయితే నిన్నటి ఈవెంట్‌కు హాజరైన ఆర్జీవీ.. తాజాగా మరో కామెంట్ చేశాడు. ‘ఇప్పుడే ఏఎమ్‌బీ చూశాను. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే.. ఈ సూపర్‌ప్లెక్స్‌కు తగ్గట్టు సినిమాలు రావడం అంటే కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్’ అంటూ ట్వీట్ చేశాడు.
Just watched a film in @urstrulyMahesh ‘s AMB Cinemas..The only problem with this Superplex is,its difficult for any film to match to this wonderful place ..The theatre is a SUPER DUPER BLOCKBUSTER
— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2018