ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నది ఎవరంటూ జోరుగా చర్చ నడుస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అక్కడ వంశపారపర్య పాలనే నడుస్తున్న క్రమంలో కిమ్ కుమారుడు లేదా సోదరుడు గద్దెనెక్కుతారని భావించినా.. కిమ్ పిల్లలు చిన్నవాళ్లు కావడం.. సోదరులతో ఆయనకు సఖ్యత లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌పై పడింది. కిమ్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరొందిన జాంగ్.. ప్రస్తుతం అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్ సభ్యురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్‌లతో కిమ్ సమావేశమైన పలు సందర్భాల్లో సోదరుడి వెంటే ఉండి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో సోదరుడి మాదిరే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న జాంగ్‌కే అధికారం చేజిక్కుంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. (కిమ్ బతికే ఉన్నాడు!)
‘‘కిమ్ జోంగ్ చనిపోయిన తర్వాత అతడి సోదరి అధికారం చేపడతారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అతడి కంటే మరింత క్రూరురాలు అయితే... ఈ ప్రపంచం మొదటి ఆడ విలన్‌ను చూస్తుంది’’అని వర్మ ట్వీట్ చేశారు. ఇందుకు స్పందనగా.. భారతీయ భర్తలకు లేడీ విలన్లంటే భయం లేదని.. ఎందుకంటే రోజూ ఇంట్లో ప్రత్యక్ష విలన్లను చూస్తున్నామంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది మాత్రం.. కిమ్ యో జాంగ్ చూపులను గమనిస్తే... ఆమె కిమ్‌కు ఏమాత్రం తీసిపోరని అనిపిస్తోందని... కిమ్ బతికి ఉంటే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.
Rumour has it that Kim Jong Un ‘s sister will take over if he dies and she supposedly is more brutal than him ..Good news is that world will have its FIRST FEMALE VILLAIN ..Finally JAMES BOND can get REAL 👍 pic.twitter.com/EAebtPvhK5
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2020
Comments
Please login to add a commentAdd a comment