
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా వ్యవహరిస్తారు. ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్ ఫిల్మ్ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. తాజాగా మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్' ట్రైలర్‌ను యూట్యూబ్ చానెల్‌లో రిలీజ్ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు భయపెట్టేలా ఉంది. దీనిపై ట్విటర్‌లో వర్మ స్పందిస్తూ .. 'మా పనిని ఆ దేవుడితో పాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నాం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి చిత్రమిదే. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ మావాళ్లు లాక్‌డౌన్ కాలేదంటూ' ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగర్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్ సంగీతమందిచారు.ప్రస్తుతం కరోనా వైరస్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
(ఈద్ కానుకగా ‘రాధే’లోని మూడో పాట విడుదల)
Comments
Please login to add a commentAdd a comment