ఓ చందమామ!
రామ్ కార్తీక్, సనా మక్బూల్ జంటగా ‘విశాఖ థ్రిల్లర్స్’ వెంకట్ దర్శకత్వంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై వరప్రసాద్ బొడ్డు నిర్మించనున్న సినిమా ‘మామ ఓ చందమామ’. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ - ‘‘కుటుంబ విలువలు, ఆప్యాయతలు, అల్లరి.. అన్నీ ఉన్న చిత్రమిది. సంక్రాంతికి 3 రోజులు పల్లెటూరి వెళ్లొచ్చి, అవన్నీ మిస్ అవుతున్నామనుకునే వాళ్లకు బహుమతిలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా మొదటి సినిమాకి మంచి టీమ్ కుదిరింది.
గోదావరి జిల్లాల్లో పల్లెటూరి.. విశాఖలో సిటీ సీన్స్ చిత్రీకరించనున్నాం. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయాలనేది ప్లాన్’’ అని సహ నిర్మాత సాధనాల మురళి అన్నారు. ఓ లక్ష్యంతో నిర్మాతలు సినిమా తీస్తున్నారని మాటల రచయిత మరుధూరి రాజా అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ సూరిశెట్టి ఉత్తర్‌కుమార్, కెమేరామ్యాన్ జి.ఎల్.బాబు, నటుడు కేథారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి పాటలు: శ్రీరాం తపస్వీ, కరుణాకరన్, సంగీతం: మున్నా కాశీ.