
పండగ చేస్కో అంటున్న రామ్
ఆనందకరమైన సందర్భాల్లో యూత్ ఎక్కువగా ఉపయోగించే పదం ‘పండగ చేస్కో’. మంచి మాస్ ఫీల్ ఉన్న పదం అది. రామ్ లాంటి కత్తిలాంటి కుర్రాడి సినిమాకైతే..
ఆనందకరమైన సందర్భాల్లో యూత్ ఎక్కువగా ఉపయోగించే పదం ‘పండగ చేస్కో’. మంచి మాస్ ఫీల్ ఉన్న పదం అది. రామ్ లాంటి కత్తిలాంటి కుర్రాడి సినిమాకైతే... ఈ టైటిల్ సరిగ్గా యాప్ట్. అందుకే... రామ్‌తో గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ ఖరారు చేశారట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన పరుచూరి కిరీటి నిర్మాత. పరుచూరి ప్రసాద్ సమర్పకుడు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రారంభ వేడుకను ఘనంగా ఈ సినిమాను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉగాది తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందట. రామ్ ఇమేజ్‌కి తగ్గట్టు హై ఎనర్జిటిక్‌గా హీరో పాత్రను డిజైన్ చేశారట గోపిచంద్ మలినేని. యువతరానికి, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ కథలో మెండుగా ఉంటాయని సమాచారం. తమన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక ఇంకా ఖరారు కాలేదు. ఓ ప్రముఖ కథానాయిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.