
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
బుధవారం రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ ను రిలీజ్ చేశారు. రామ్‌ను ఫుల్ మాస్ అవతారంలో పరిచయం చేశాడు పూరి. తెలంగాణ యాసలో రామ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీన్స్, టేకింగ్ చూస్తుంటే పూరి ఈ సారి సక్సెస్ కొట్టేలాగే ఉన్నాడనిపిస్తుంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment