ఇంత మెజార్టీ వస్తుందని ఊహించలేదు : వర్మ | Ramgopal Varma Wants To Make CM KCR Biopic | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తా : వర్మ

Published Thu, Dec 13 2018 8:09 PM | Last Updated on Fri, Dec 14 2018 4:51 PM

Ramgopal Varma Wants To Make CM KCR Biopic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సమర్పణలో ధనుంజయ్‌, ఐరా మోర్‌లు జంటగా రూపొందిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భైరవ గీత. వర్మశిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో... తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడనాట విడుదల కాగా.. డిసెంబరు 14న టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో భైరవగీత ప్రమోషన్లలో భాగంగా రామ్‌ గోపాల్‌ వర్మ సాక్షి టీవీతో మాట్లాడారు. సినిమా విశేషాలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్‌ మిషన్‌ గన్‌ తీసుకుని ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా కాల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న విశ్వాసమే ఆయన్ను గెలిపించిందనేది నా భావన. అందరూ హంగ్‌ వస్తుంది లేదా ఇంకా ఏదో జరుగుతుందని చెప్పారు. కానీ ఎవరూ కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. నేను కూడా అస్సలు ఊహించలేదు’  అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తా...
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ను పొగుడుతూ వర్మ చేసిన ట్వీట్‌ గురించి ప్రశ్నించగా..... ‘ఓ ముఖ్యమంత్రి అదీ రెండోసారి.. మొదటి దఫా కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం నిజంగా అరుదైన విషయం. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఆయన్ను 2.ఓ అన్నాను. నిజం చెప్పాలంటే ఆయన ఇలియానా కంటే అందంగా ఉంటారు. అందం అంటే లుక్స్‌కి సంబంధించింది కాదు. ఆకర్షించే గుణం గురించి నేను మాట్లాడుతున్నది. ఇలియానా డాన్స్‌ మూడు నిమిషాల కంటే ఎక్కువ చూడలేను. అదే కేసీఆర్‌ మాట్లాడితే మూడు గంటలపాటైనా వింటాను. ఎందుకంటే అన్నీ పంచ్‌ డైలాగ్‌లు పేలుస్తారు. హీరోల కంటే కూడా ఆయన చరిష్మా గొప్పది. కుదిరితే ఆయన బయోపిక్‌ కచ్చితంగా తెరకెక్కిస్తాను’  అంటూ వర్మ తన మనసులోని భావాలు పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement