కొందరికి అతను విలన్. మిగతావారికి అతను హీరో. ఇంతకీ అతను హీరోనా? విలనా? ఆ సంగతి ఆగస్ట్‌లో తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’. పీడీవి ప్రసాద్, నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. అదే మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి. కోపాన్ని, దాహాన్ని ఒకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు’’ అంటూ ఈ టీజర్‌లో శర్వానంద్ చెప్పే డైలాగులు ఓ హైలెట్. అలాగే టైటిల్, టీజర్ చూస్తుంటే సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. రెండు డిఫరెంట్స్ షేడ్స్‌లో శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఆగస్ట్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: ప్రశాంత్ పిళ్లై.
Comments
Please login to add a commentAdd a comment