
అలియా భట్ - నీతూ కపూర్ (ఫైల్‌ఫోటో)
ముంబై : ఇన్నిరోజుల అభిమానుల ఎదురుచూపులకు సమాధానమిచ్చాడు రణ్‌బీర్ కపూర్..‘అవును నేను, అలియా ఇద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’అంటూ నిర్ధారించాడు. అయితే రణ్‌బీర్ కంటే ముందే రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ వీరద్దరి బంధం గురించి క్లూలు ఇస్తూనే ఉన్నారు. ఒకసారి అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఈ రోజు(గురువారం) అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అలియా తన పిల్లితో ఆడుకుంటున్న ఈ ఫోటోకు నీతూ కపూర్ వావ్ అంటూ ‘హార్ట్ ఎమోజి’ని పోస్టు చేశారు. అందుకు అలియా ‘హాలో, ఘోస్ట్ ఎమోజీస్’ పోస్టు చేసింది. వీరిద్దరి సంభాషణ చూసిన ఒక అభిమాని ‘పెళ్లి కుదిరిందా’ అంటూ కామెంట్ చేశాడు.
ఈ రోజనే కాదు మదర్స్ డే రోజున అలియా తన తల్లిని ఉద్ధేశిస్తూ చేసిన మెసేజ్‌కు కూడా నీతూ కపూర్ ఇలానే ‘హార్ట్ ఎమోజీ’ని పోస్టు చేస్తే అందుకు బదులుగా అలియా ‘కిస్సింగ్ ఎమోజీ’ని పోస్టు చేసింది. వీటన్నింటిని చూస్తే రణ్‌బీర్ కంటే ముందే నీతూ కపూర్ వీరి బంధం గురించి అభిమానులకు క్లూ ఇస్తూనే ఉన్నారని అర్ధమవుతుంది కదా. అలియా, రణ్‌బీర్‌ల బంధం గురించి చాలా రోజులుగా బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో స్వయంగా రణబీర్ కపూరే ‘మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నాం’ అని ప్రకటించాడు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ ‘అవును మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నాం...కానీ ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు’ అన్నారు రణ్‌బీర్.
అలియా గురించి అడగ్గా ‘మనిషిగా, నటిగా ఏది సరైనదో దాన్నే నిక్కచ్చిగా పాటించే వ్యక్తి అలియా. ప్రతి విషయంలో ఆమె నాకు ఆదర్శంగా నిలుస్తుంది’అన్నారు. ‘మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మరికొంత దూరం కలిసి ప్రయాణిస్తే మా బంధం మరింత బలపడుతుంది’ అని చెప్పారు. ప్రేమలో పడటం ఎప్పడు ఆసక్తిగానే ఉంటుంది. కొత్త మనిషి.. కొత్త ఆలోచనలు.. పాత విషయాలనే మరోసారి కొత్తగా చేస్తుంటామని అన్నారు. అలానే ఇప్పుడు తాను చాలా మారానని, బంధాలకు చాలా విలువ ఇస్తానని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment