
అందాల సుందరి రాశీఖన్నా హీరో శింబూకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు. ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన ‘చెక్క చివంద వానమ్’ చిత్రం తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు శింబు. తాజాగా సుందర్ సి. దర్శకత్వంలో ఆయన నటించిన ‘వందా రాజావాదాన్ వరువేన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ చిత్రంలో నటించనున్నారు శింబు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో శింబు సరసన రాశీ ఖన్నాను కథానాయికగా తీసుకున్నారట.
‘ఇౖమైక్క నొడిగళ్’తో తమిళంలోకి అడుగుపెట్టి, ఇటీవల కథానాయికగా ‘అడంగామారు’తో మంచి విజయం అందుకున్నారు రాశీ ఖన్నా. మరోవైపు ‘టెంపర్’కి రీమేక్‌గా విశాల్ సరసన ఆమె నటించిన ‘అయోగ్య’ రిలీజ్‌కి రెడీగా ఉంది. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో ‘సైతాన్ కా బచ్చా’ అనే మరో తమిళ చిత్రంలో నటిస్తున్నారు రాశీ. ఇప్పుడు శింబు ‘మానాడు’ సినిమా ఆఫర్. ఈ చిత్రం కోసం 28 రోజులు బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారట శింబు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment