హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుంటా   | Rashmika Mandanna Special Interview In Sakshi At Hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయి అనుకుంటున్నారు

Published Sun, Feb 23 2020 7:35 AM | Last Updated on Sun, Feb 23 2020 11:09 AM

Rashmika Mandanna Special Interview In Sakshi At Hyderabad

శాండిల్‌వుడ్‌ నుంచి ‘చలో..’ అంటూ టాలీవుడ్‌కు వచ్చి.. ‘గీతగోవిందం’తో గిలిగింతలు పెట్టి.. ‘దేవదాస్‌’లా మారకండని చెప్పి ప్రశ్నించే వాడే ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటూ ‘భీష్మ’తో వచ్చిన రష్మిక మందన్నా తనకు సిటీలోనే ఉండాలని ఉందని పేర్కొంది.

సినిమా మేనరిజం, డైలాగులు ఒక్కోసారి ఆయా నటుల జీవితంలో కీలక మలుపు తిప్పుతాయి.. సరిగ్గా అలాంటి ఒక డైలాగుతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అభిమానపు గూడు కట్టుకుంది ఈ కన్నడ భామ.. ‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’ అంటూ సినీహీరో మహేష్‌బాబు పక్కన కళ్లతో హాభావాలు పలికించడమే కాదు..అభిమానుల గుండెల్లో తన అభినయంతో ఆమె చెరగని ముద్ర వేసుకొంది.. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విజయ్‌పేట్‌లో జన్మించిన రషి్మక విద్యాభ్యాసమంతా కర్ణాటకలోనే సాగింది.

కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివిన ఆమె ఎంఎస్‌ రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. పద్దెనిమిదేళ్లకే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. చారుశీలగా గుర్తింపు పొందిన రష్మిక మందాన బంజారాహిల్స్‌లోని ఓ కార్యక్రమానికి విచ్చేసిన  సందర్భంగా ఆమెను పలకరించగా చెప్పిన విశేషాలివి..  తన మనసులోని మనోభావాలను ‘సాక్షి’తో ఇలా పంచుకొంది..

కుక్క బిస్కెట్లు రుచి చూశాను. 
నేను ప్రతి విషయాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తాను. నాకు ఒక కుక్కపిల్ల ఉంది. అది చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇంత క్యూట్‌గా ఉంటుంది కదా..! ఇది తినే బిస్కెట్‌ తింటే ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్‌ టేస్ట్‌ చేశాను అంతే..! అంత అసహ్యంగా ఏమి లేదు. 

కోపం వస్తే షాపింగ్‌ చేస్తా.. 
నాది చాలా సాధారణమైన జీవితం. షాపింగ్‌కు ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టను. నాకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి షాపింగ్‌ చేస్తాను. ఇక దుస్తుల విషయంలోనూ సంప్రదాయ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతాను. ఖాళీ లభిస్తే టీవీ, పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడుపుతాను. యానిమేటెడ్‌ కార్టూన్,  చైతన్యపరిచే పుస్తకాలను ఎక్కువగా చదువుతాను.
 

తెలుగమ్మాయి అనుకుంటున్నారు
మీకు తెలుసా.. నన్నందరూ తెలుగమ్మాయి అనుకుంటున్నారు. నేను కూడా అచ్చు తెలుగు అమ్మాయిలాగానే ఉండటమే కాదు బాగా మాట్లాడుతున్నాను కూడా. మొన్నటి సినిమాలో డబ్బింగ్‌ కూడా నేనే చెప్పుకున్నాను. తెలుగు మాట్లాడుతుంటే కన్నడ మాట్లాడినట్లుగానే ఉంటున్నది.  

సినిమాల్లోకి రాకుంటే.. 
సినిమాల్లో అవకాశం రాకుంటే ఖచి్చతగా ఫిట్‌నెస్, క్రీడలకు సంబంధించి వ్యాపారంలోకి అడుగుపెట్టేదానిని. లేదంటే సైకియాట్రిస్టుగా చేసేదానిని.  సమయం లభిస్తే ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతాను. సినిమాల్లోకి రాకముందు ఎక్కువ సమయం అక్కడే ఉండేదానిని. ఇప్పుడు సమయం తగ్గడంతో రోజు గంటపాటు జిమ్‌కు కేటాయిస్తున్నాను.

చార్మినార్‌ చూడాలని ఉంది 
ప్రేమ చిహ్నమైన చారి్మనార్‌ గురించి విన్నాను. అయితే అక్కడికి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు. ఏదో ఒక రోజు అర్ధరాత్రి బురఖా వేసుకొని చూసి వస్తాను. గోల్కొండ కోట కూడా చూడాలని ఉంది.  

ఇక్కడే ఇల్లు కొనుక్కుంటా  
ఇంకో రెండు, మూడు సినిమాలు  చేయాల్సి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండాలనిపిస్తోంది.  

బిర్యానీ బాగా లాగించేదాన్ని 
మూడేళ్ళ క్రితం ఇక్కడ షూటింగ్‌లకు వచి్చనప్పుడు హైదరాబాద్‌ బిర్యానీ బాగా తినేదాన్ని. కానీ ఇటీవల నాన్‌వెజ్‌ మానేసాను. అందుకే బిర్యానీ తినాలని ఉన్నా ఎలాగో అలాగ కంట్రోల్‌ చేసుకుంటున్నాను.

ఇక్కడి రోడ్లలో అమెరికా లగ్జరీ చూశా 
హైదరాబాద్‌లో లగ్జరీ లైఫ్‌ బాగా పెరిగింది. పబ్‌ కల్చర్‌ బాగా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్‌లోని ఒక రోడ్డు చూశాను. అమెరికా, ఆస్ట్రేలియా నగరాల్లో ఉన్నటువంటి లగ్జరీ కనిపించింది.

స్మైల్‌... హైదరాబాదీ స్పెషల్‌
హైదరాబాదీలు మర్యాద ఇస్తారు.. పాటిస్తారు. ఎప్పుడూ నవ్వుతుండటం కూడా బాగా గమనించాను.

అవకాశమిలా.. 
కళాశాలలో ఉన్న మయంలో ఫ్రెష్‌ ఫేస్‌ పేరుతో నిర్వహిస్తున్న ఆడిషన్స్‌కు నాకు తెలియకుండానే కాలేజి లెక్చరర్‌ నా పేరు ఇచ్చారు. అలా కాలేజ్‌ కార్యక్రమంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాను. అక్కడి నుంచి బెంగుళూరులోనే అన్ని కళాశాలలకు చెందిన విజేతలతో నిర్వహించిన పోటీలోనూ ప్రథమస్థానం దక్కించుకొన్నాను. ముంబైలో జరిగిన ఫైనల్స్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన కళాశాల యువతులతో పోటీ పడి టైటిల్‌ సాధించాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. అంతేకాదు.. బెంగుళూరులో ఫ్రెష్‌ ఫేస్‌గా గెలుపొందడం నా ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. అక్కడి నుంచే కిరిక్‌ పార్టీ సినిమా నిర్మాణ బృందం నుంచి పిలుపొచి్చంది. అలా సినిమాల్లోకి వెళ్లే అవకాశం వచి్చంది.

నేను ఇప్పుడు శాకాహారిని.. 
నాకు స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం. ఎలాంటి స్వీట్‌ ఇచ్చినా తినేస్తాను. అయితే సినిమాల్లోకి వచ్చాక స్వీటు జోలికి వెళ్లనివ్వడం లేదు. ముట్టుకోనివ్వడం లేదు. మరో విషయం ఏమంటే ఎనిమిది నెలల నుంచి మాంసాహారం ముట్టుకోవడం లేదు. ఇప్పుడు నేను పూర్తి శాకాహారిని. మనతోటి జంతువులను కోసుకొని తినడం నచ్చకనే నేను మాంసాహారం వదిలేశాను. 

చదువుకే ప్రాధాన్యమన్నారు..
కాలేజీలో ఉన్నప్పటి నుంచి సినిమాల్లో చేయాలని అనుకొనేదానిని. అయితే మా అమ్మనాన్నలు చదువుకు ప్రాధాన్యమివ్వాలనేవార. ఈ కారణంగానే ముందు చదువు పూర్తి చేసిన నేను సినిమాలు, సీరియళ్లలో చేయాలని ప్రయతి్నంచాను. అలా అనుకోకుండా చాన్స్‌ వచి్చంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఆఫ్‌స్క్రీన్‌లో నటించలేను. కెమెరా ముందుకెళ్లి యాక్షన్‌ అంటేనే నటిస్తాను. నాకు బయట నటించాలంటే చాలా బిడియం.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement