రవితేజ వారసుడొస్తున్నాడు | Ravi Teja son enter to movies | Sakshi
Sakshi News home page

రవితేజ వారసుడొస్తున్నాడు

Published Wed, Sep 6 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

రవితేజ వారసుడొస్తున్నాడు

రవితేజ వారసుడొస్తున్నాడు

మహాధన్‌... సన్నాఫ్‌ రవితేజ. అప్పుడప్పుడూ రవితేజ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే ఫొటోల్లో చూడడమే తప్ప... సినిమాల్లోనూ, సినీ వేడుకల్లోనూ ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. త్వరలో మహాధన్‌ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. యస్‌... రవితేజ వారసుడొస్తున్నాడు. ఓ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న సినిమా ‘రాజా.. ది గ్రేట్‌’. ఇందులోనే హీరో చిన్నప్పటి పాత్రలో అంటే చైల్డ్‌ రవితేజగా మహాధన్‌ నటిస్తున్నాడు. ఆల్రెడీ మహాధన్‌పై కొన్ని సీన్లు తీశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ పాత్రకు చాలామంది చైల్డ్‌ ఆర్టిస్టులను ఆడిషన్‌ చేశారట!

వాళ్లెవరూ అనిల్‌ రావిపూడికి నచ్చలేదట. ఓ రోజు ఆయన మహాధన్‌ను చూడడం, అతనే ‘రాజా.. ది గ్రేట్‌’లో హీరో చైల్డ్‌ ఎపిసోడ్స్‌కి సూటవుతాడని చెప్పడంతో రవితేజ అంగీకరించారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్‌ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement