
వరుస ఫ్లాపులతో సతమతమయిన రవితేజకు ఈ ఏడాది విడుదలైన 'క్రాక్' కొండంత ఎనర్జీనిచ్చింది. కరోనా సమయంలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేయడమే కాక అభిమానులతో ఈలలు వేయించింది. అలా బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఈ ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించాడు రవితేజ. క్రాక్ ఇచ్చిన బూస్టింగ్‌తో స్పీడ్ పెంచాడీ హీరో.
ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అలాగే శరత్ మండవ డైరెక్షన్‌లో మాస్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. దర్శకులు హరీశ్ శంకర్, వంశీకృష్ణల ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా వుంటే ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా రవితేజ తన తండ్రి, కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో రవితేజ కొడుకు మహాధాన్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. ఇది చూసిన ఆయన అభిమానులు రానున్న రోజుల్లో రవితేజ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కాగా రవితేజ 2000వ సంవత్సరంలో కల్యాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు మోక్షధ, కొడుకు మహాధాన్ సంతానం.
Comments
Please login to add a commentAdd a comment