
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో నటీనటులంతా ఇళ్లకే పరిమితయ్యారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ప్రముఖ హీరో రవితేజ్ కూడా ఈ సమయాన్ని పిల్లలతో, కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జిమ్‌లో కూడా వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నారు. ఇంటివద్దే ఉండండి.. ఫిట్‌గా ఉండండనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు. పిల్లలో కలిసి రవితేజ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రవితేజ తన పర్సనల్ విషయాలు ఎక్కువగా ఎక్కడా షేర్ చేసుకోరు. తన ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కడా బయటపెట్టరు. కానీ ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. కాగా, రవితేజ కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
మరోవైపు లాక్‌డౌన్ వేళ ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు రవితేజ తనవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటి మనకోసంకు రవితేజ రూ. 20 లక్షల విరాళం ఇచ్చారు. సినిమాల విషయానికి వస్తే వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.
చదవండి : కష్టాల్లో సినీ కార్మికులు : రవితేజ చేయూత




Comments
Please login to add a commentAdd a comment