ఆగలేదు | Producer Koneru Satyanarayana Confirmed The Project With Ravi Teja | Sakshi
Sakshi News home page

ఆగలేదు

Published Fri, May 22 2020 1:08 AM | Last Updated on Fri, May 22 2020 1:08 AM

Producer Koneru Satyanarayana Confirmed The Project With Ravi Teja - Sakshi

రవితేజ

రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఏ స్టూడియోస్‌ పతాకంపై హవీష్‌ ప్రొడక్షన్‌లో ఈ సినిమా నిర్మిస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ ఆ మధ్య ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆగాయి. దాంతో ఈ సినిమా ఆగిందనే వార్తలు మొదలయ్యాయి. అందులో నిజం లేదన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ సినిమాపై వస్తున్న వదంతులను నమ్మవద్దు. లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తాం. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement