మరోసారి మాస్ హీరోతో..! | Ravi Teja to pair up with Raashi Khanna again | Sakshi
Sakshi News home page

మరోసారి మాస్ హీరోతో..!

Published Thu, Sep 29 2016 12:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

మరోసారి మాస్ హీరోతో..!

మరోసారి మాస్ హీరోతో..!

ఈ జనరేషన్ హీరోయిన్లలో ఫుల్ ఫాంలో ఉన్న బ్యూటీస్ రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా. రెజీనా, లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్స్ ఫాంలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నా స్టార్ హీరోల సినిమాలలో మాత్రం పెద్దగా కనిపించటం లేదు. అయితే రకుల్ రేంజ్ భారీగా పెరిగిపోవటంతో మీడియం రేంజ్ హీరోలకు అందుబాటులో లేకుండా పోయింది. దీంలో రాశీఖన్నాను వరుస ఆఫర్లు పలుకరిస్తున్నాయి.

ఒకప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ముఖ్యంగా రాశీతో ఒక సినిమా చేసిన హీరోలో మరోసారి ఆమెకే ఛాన్స్ ఇస్తున్నారు. గతంలో శివమ్ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటించిన రాశీ తాజాగా రామ్ హీరోగా తెరకెక్కిన హైపర్లోనూ ఈ ఎనర్జిటిక్ హీరోతో జతకట్టింది. అదే బాటలో బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించిన రాశీఖన్నా మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. రవితేజ్ హీరోగా త్వరలో ప్రారంభకానున్న సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా ఫైనల్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement