
నిధీ అగర్వాల్, రవితేజ
‘ఇస్మార్ట్ శంకర్’కి ముందు నిధీ అగర్వాల్ చేసిన ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ కమర్షియల్ సినిమాలే అయినా ‘ఇస్మార్ట్..’ అంత మాస్ కాదు. ఈ సినిమా తర్వాత నిధీ అగర్వాల్ మరో ఫుల్ మాస్ సినిమా అంగీకరించారు. మాస్ హీరో రవితేజ నటించనున్న ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. రవితేజ–నిధి జోడీ సెట్ అయిన విషయాన్ని చిత్రనిర్మాత సత్యనారాయణ కోనేరు గురువారం ప్రకటించారు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఒకరు నిధీ అగర్వాల్ కాగా మరో హీరోయిన్‌ని త్వరలో ప్రకటిస్తారు. మే నెలాఖరున ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment