
ఫైనల్ గా రేణూదేశాయ్, పవన్ కల్యాణ్ తో విడాకులకు సంబంధించిన విషయంపై స్పందించారు. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పర్సనల్ యుట్యూబ్ చానల్‌లో రిలీజ్ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు.
విడాకులకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. ముందు పవన్ కల్యానే విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదన్న రేణూ... ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment