renuu desai
-
ఆ మెస్సేజ్‌ల వల్ల ప్రాణాలు పోతున్నాయి.. రేణూ దేశాయ్ ఫైర్
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్లు పెట్టే సరదా సందేశాల వల్ల సాయం అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణూ దేశాయ్.. కరోనా కష్టకాలంలో తనకు దోచిన సాయం అందిస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా కోవిడ్ బాధితులకు ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి వివరాలను అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. తన ఇన్‌స్టా ఖాతాలో మెసేజ్ ఇన్ బాక్స్‌లో మెసేజ్ పెట్టిన వారికి సమయానికి సరైన వైద్యం అందేలా చూస్తున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆమెకు హాయ్, హలో అంటూ సరదా మెసేజ్‌లు పంపిస్తున్నారు. వీటిపై రేణూ ఫైర్ అయింది. తనకి హాయ్, హలో, లేదా ఏదైనా సరదా మెస్సేజ్‌లు పంపించవద్దని, దాని వల్ల కొంత మంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘దయచేసి నాకు హాయ్, హలో అనే మెస్సేజ్‌లు పంపించకండి. మీరు పంపించే మెస్సేజ్‌ల కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల మెస్సేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు. కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’ అని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ట్విటర్ అకౌంట్ లేదని, తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) -
పవనే విడాకులు కావాలన్నారు : రేణూ
ఫైనల్ గా రేణూదేశాయ్, పవన్ కల్యాణ్ తో విడాకులకు సంబంధించిన విషయంపై స్పందించారు. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పర్సనల్ యుట్యూబ్ చానల్లో రిలీజ్ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు. విడాకులకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. ముందు పవన్ కల్యానే విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదన్న రేణూ... ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు. -
నేను ట్వీట్ చేస్తేనే..అది నిజం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ కు సీక్వెల్ వస్తుందన్న వార్తలపై రేణు దేశాయ్ ట్విట్టర్ లో స్పందించారు. పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖుషి చిత్రానికి సీక్వెల్ వస్తుందని, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుందని టాలీవుడ్ లో వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అలాంటి వార్త ఏదైనా ఉంటే.. తానే ట్విట్టర్ ద్వారా తెలియచేస్తాననీ, ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా వుంటే రేణు దేశాయ్ ఈ వార్తలపై కూడా ట్విట్టర్ లోనే రియాక్ట్ అయ్యారు. హలో ఆల్.. నేను ట్వీట్ చేస్తేనే..అది నిజం, మిగతా అంతా పిచ్చివాళ్ల వెర్రి ఊహలే అని ఆమె కొట్టి పారేశారు. డైరెక్ట్ గా ఖుషి సీక్వెల్ లేదు అని చెప్పలేదు కానీ, క్రేజీ ఇమాజినేషన్స్ అంటూ సుతారంగా ఖండించారు. Hello all :) Only if I tweet it here it's true, rest all is the crazy imagination of crazier beings :D — renu (@renuudesai) March 16, 2016 -
భక్తురాలిగా మారిన హీరోయిన్?
హీరో హీరోయిన్లలో భక్తి పాలు ఒకింత ఎక్కువే ఉంటుంది. సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచి విడుదలకు ముందు తిరుపతి వెళ్లి స్వామికి మొక్కుకోవడం వరకు చాలా సందర్భాలలో నటీనటుల్లో పరమ భక్తులను మనం చూస్తుంటాం. ఇదే కోవలో.. ప్రస్తుతం సినిమాల్లో నటించడం మానేసి, దర్శకత్వం లాంటి బాధ్యతలలో మునిగి తేలుతున్న అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం కొంతవరకు భక్తిమార్గంలో నడుస్తున్నారు. తాను మరీ పరమ భక్తురాలిని అయితే కాదు గానీ.. ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటే.. చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతోంది. సోమవారం పొద్దున్నే గుడికి వెళ్లొచ్చిన తర్వాత తీసిన ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. దీన్ని చూస్తే.. హీరోలు, హీరోయిన్లలో ఉండే భక్తిభావం ఎంత ఉందో తెలుస్తుంది. I am not a very religious person but an early morning darshan gets a certain peace & tranquility to the soul always pic.twitter.com/XGGFc9kl8F — renu (@renuudesai) October 25, 2015 -
జూనియర్ పవన్‌లు ఏం చేశారు?
వినాయకచవితి వచ్చిందంటే పిల్లలకు పండగే. గణపతిని రకరకాలుగా అలంకరించడానికి పొద్దున్నే లేచి.. స్నానం చేసి రెడీ అయిపోతారు. తమకు చేతనైన రీతిలో అందంగా గణేశుడికి అలంకారాలు చేసి మురిసిపోతారు, మురిపిస్తారు కూడా. ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయడం ఇప్పుడు అందరికీ బాగా అలవాటైంది. ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించకుండా.. మట్టితోను, అందుబాటులో ఉన్న రంగులతోను వినాయకుడి విగ్రహాలను చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్య ఇద్దరూ కలిసి మంచి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పుణెలో తల్లి రేణు దేశాయ్ వద్ద ఉంటున్న అకీరా, ఆద్య కలిసి ఎలాంటి థర్మోకోల్, ప్లాస్టిక్ డెకరేషన్లు ఉపయోగించకుండా గణపతిని తయారు చేశారు. కొబ్బరి కాయలు, పూలు, పళ్లతో పూజ చేసుకున్నారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. తమ పిల్లల కళను అందరికీ పరిచయం చేశారు. Tiny ecofriendly Ganpati Bappa made by Akira & Aadya :) No thermocol or plastic decorations:) #GanpatiBappaMorya pic.twitter.com/ewSBbUBPlE — renu (@renuudesai) September 17, 2015