నేను ట్వీట్ చేస్తేనే..అది నిజం | Only if I tweet it here it's true, rest all is the crazy imagination of crazier beings :D | Sakshi
Sakshi News home page

నేను ట్వీట్ చేస్తేనే..అది నిజం

Published Thu, Mar 17 2016 4:40 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Only if I tweet it here it's true, rest all is the crazy imagination of crazier beings :D

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఆల్ టైం హిట్ కు సీక్వెల్ వస్తుందన్న వార్తలపై రేణు దేశాయ్ ట్విట్టర్ లో స్పందించారు.  పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో వచ్చిన  సూపర్ హిట్ మూవీ ఖుషి చిత్రానికి  సీక్వెల్ వస్తుందని, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుందని టాలీవుడ్ లో వార్తలు హల్చల్ చేశాయి.  ఈ నేపథ్యంలో అలాంటి వార్త ఏదైనా ఉంటే.. తానే ట్విట్టర్ ద్వారా తెలియచేస్తాననీ,  ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు.  

సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా  వుంటే రేణు దేశాయ్  ఈ వార్తలపై  కూడా  ట్విట్టర్ లోనే రియాక్ట్ అయ్యారు. హలో ఆల్..  నేను ట్వీట్ చేస్తేనే..అది నిజం, మిగతా  అంతా  పిచ్చివాళ్ల వెర్రి ఊహలే అని ఆమె కొట్టి పారేశారు.  డైరెక్ట్ గా ఖుషి సీక్వెల్ లేదు అని  చెప్పలేదు కానీ,   క్రేజీ ఇమాజినేషన్స్  అంటూ  సుతారంగా   ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement