పోలీస్ గా మారిన 'పోలీసోడు'
పోలీస్ గా మారిన 'పోలీసోడు'
Published Thu, Apr 14 2016 4:13 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
విజయ్ తాజా చిత్రం 'పోలీసోడు' టైటిల్‌ను 'పోలీస్'గా మార్చేశారు. తమిళంలో 'తెరి' అనే పేరుతో గురువారం విడుదల అయిన ఈ సినిమా తెలుగులో 'పోలీస్' గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్ర టైటిల్‌పై పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రానికి పెట్టిన పేరు పోలీసుల్ని అగౌరవపరిచేదిగా, వారి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి ఆరోపించారు.
ఈ సినిమా శుక్రవారం విడుదలకానున్న క్రమంలో ఈ లోపు చిత్రం పేరు మార్చాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం రాత్రి దిల్‌రాజు ఇంటి వద్ద పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే స్పందించిన దిల్ రాజు గురువారం చిత్ర టైటిల్‌ను మార్చేసినట్లు తెలిపారు.కాగా తమిళవాడులో గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. విజయ్ సరసన హీరోయిన్గా సమంతా నటించింది.
Advertisement