ఆ ఇద్దరితో ట్రై చేస్తా! | ritika singh tries to dhanush and ajith | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో ట్రై చేస్తా!

Published Mon, Apr 11 2016 3:50 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

ఆ ఇద్దరితో ట్రై చేస్తా! - Sakshi

ఆ ఇద్దరితో ట్రై చేస్తా!

తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును గెలుచుకునే అదృష్టం అరుదుగానే కలుగుతుంది. అలాంటి అదృష్టాన్ని పొందిన నటి రితికా సింగ్. ఈ డిల్లీ బ్యూటీ మాధవన్ హీరోగా నటించిన ఇరుదుచుట్రు(చివరి రౌండ్)చిత్రంతో హీరోయిన్‌గా తొలిరౌండ్‌ను ప్రారంభించారన్నది తెలిసిన విషయమే. రితిక నిజజీవితంలో ఒక బాక్సర్. అదే తనని చిత్ర రంగంలోకి ఆహ్వానించేల చేసింది.అంతే కాదు ఆమె తొలి చిత్రంలోనూ బాక్సర్‌గా నటించి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అయితే ఆ అవార్డు తనను వరించడంలో కాస్తంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది బోల్డ్ బ్యూటీ.

తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటేనే కథా జాతీయ అవార్డులు వరిస్తాయి. అలాంటిది తాను డబ్బింగ్ చెప్పకుండానే తనకు అవార్డును ఎలా ప్రకటించారన్న సందేహాన్ని,అవార్డును గెలుచుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న రితిక ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా ఆండ వన్ కట్టళై చిత్రంలో నటిస్తున్నారు. అయితే తనకు తెలిసిన హిందీ భాషలోనే నటించాలన్న ఆసక్తిని స్పష్టం చేస్తున్న ఈ ముద్దుగుమ్మను కోలీవుడ్‌లో మీకు ఇష్టమై హీరోలెవరన్న ప్రశ్నకు అజిత్, ధనుష్ అంటై టక్కున బదులిచ్చారు.

అంతే కాదు వారితో నటించే అవకాశాలు రాకుంటే తాను వాటిని అందుకునే ప్రయత్నాలు చేస్తానని అంటున్నారు.  ఈ అమ్మడికిప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అవకాశాలు ఎదురు చూస్తున్నాయని సినీవర్గాలంటున్నాయి. మరి అలాంటి వాటిలో తను ఆకాంక్షించే నటులు అజిత్,ధనుష్ చిత్రాల అవకాశాలు ఎప్పటికి చేరుతాయో?వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement