రాబిన్ విలియమ్స్ సూసైడ్ కు ముందు వీడియో..
రాబిన్ విలియమ్స్ సూసైడ్ కు ముందు వీడియో..
Published Tue, Aug 19 2014 12:11 PM | Last Updated on Tue, Nov 6 2018 8:41 PM
న్యూయార్క్: హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ తాను ఆత్మహత్యకు ముందు గుడ్ బై చెబుతూ ఐఫోన్ లో చిత్రీకరించిన వీడియో అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచారం జరుగుతున్న తీరు అంతా భూటకమని కొట్టి పారేస్తున్నారు.
ఫేస్ బుక్ లో కాని, ఇతర సోషల్ మీడియాలో వెబ్ సైట్లలో రాబిన్ విలియమ్స్ చిట్టచివరి వీడియో అంటూ వచ్చే పోస్టింగ్ ల్లో వాస్తవం లేదని.. . కేవలం ఇంటర్నెట్ లో సర్వే కు పాల్పడుతున్న కంపెనీలు ఓ చీప్ ట్రిక్కులకు పాల్పడుతున్నారు. విలియమ్స్ చిట్ట చివరి వీడియోను షేర్ చేయండి.. లేదా క్లిక్ చేయండి వచ్చే వాటి విషయంలో జాగ్రత్త అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ఎవరైనా అలాంటి లింక్ ను క్లిక్ చేస్తే ముందు సర్వే ఫారాన్ని పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ వ్యాపారంలో అదనపు రెవిన్యూ కోసం వెంపర్లాడే వారు ఇలా ప్రముఖ హాలీవుడ్ రాబిన్ విలియమ్స్ పేరును వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement