Robin Williams
-
రాబిన్ విలియమ్స్ సూసైడ్ కు ముందు వీడియో..
న్యూయార్క్: హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ తాను ఆత్మహత్యకు ముందు గుడ్ బై చెబుతూ ఐఫోన్ లో చిత్రీకరించిన వీడియో అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచారం జరుగుతున్న తీరు అంతా భూటకమని కొట్టి పారేస్తున్నారు. ఫేస్ బుక్ లో కాని, ఇతర సోషల్ మీడియాలో వెబ్ సైట్లలో రాబిన్ విలియమ్స్ చిట్టచివరి వీడియో అంటూ వచ్చే పోస్టింగ్ ల్లో వాస్తవం లేదని.. . కేవలం ఇంటర్నెట్ లో సర్వే కు పాల్పడుతున్న కంపెనీలు ఓ చీప్ ట్రిక్కులకు పాల్పడుతున్నారు. విలియమ్స్ చిట్ట చివరి వీడియోను షేర్ చేయండి.. లేదా క్లిక్ చేయండి వచ్చే వాటి విషయంలో జాగ్రత్త అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అలాంటి లింక్ ను క్లిక్ చేస్తే ముందు సర్వే ఫారాన్ని పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ వ్యాపారంలో అదనపు రెవిన్యూ కోసం వెంపర్లాడే వారు ఇలా ప్రముఖ హాలీవుడ్ రాబిన్ విలియమ్స్ పేరును వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
విశ్వాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య
నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికులు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి. ‘అతడు మనందరినీ నవ్వించాడు. కన్నీళ్లూ పెట్టించాడు.’ అంటూ విచారం ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబిన్ విలియమ్స్(జూలై 21, 1951-ఆగస్ట్ 11, 2014) మరణవార్త విని. ఉల్కాపాతం వంటి మేధో పరమైన హాస్యాన్ని చిందించిన ఆ హాలీవుడ్ దిగ్గజం కూలిపోయింది. ఈ సంగతి తెలిశాక శ్వేతసౌధం మౌనం వహించడం సాధ్యం కాకుండా ముందే చేశాడు రాబిన్. ఎందుకంటే, ‘వ్యంగ్యం చచ్చిపోయిందని ప్రజలంతా అంటూ ఉంటారు. కానీ ఆ మాట అబద్ధం. వ్యంగ్యం జీవించి ఉండడమే కాదు, శ్వేత సౌధంలో మనుగడ సాగిస్తోంది’ అంటూ ఒక సందర్భంలో నిశితమైన చెణుకు విసిరాడతడు. నిజమే, ఓ చానల్ చెప్పి నట్టు రాబిన్ అమెరికన్లకి నవ్వడం నేర్పాడు. లోకానికి నవ్వు ను కానుకగా ఇచ్చి, ఆత్మహత్యతో దాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికు లు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి. తరు వాత వేదికల మీద హాస్య, వ్యంగ్య ప్రదర్శనలు ఇచ్చే వృత్తిని చేపట్టాడు. ‘నేను నటుడిని కావాలని అనుకుంటున్నాను’ అని తండ్రితో చెబితే, ‘మంచిది, దానితో పాటు ఎప్పుడైనా పనికొస్తుంది, వెల్డింగ్ వంటి వృత్తి కూడా ఒకటి నేర్చుకో!’ మని ఆయన సలహా ఇచ్చాడట. కానీ రాబిన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ‘స్టాండ్ అప్ కమేడియన్’ ఆస్కార్ వేదిక మీద ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకునేవరకు ప్రయాణం ఆపలేదు. ‘మోర్క్ అండ్ మిండీ’ అనే మొదటి టీవీ షోతోనే రాబిన్ ప్రపంచ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. హాలీవుడ్ అక్కున చేర్చుకుంది. పాపయ్, ది వరల్డ్ అకార్డింగ్ టు గార్ప్, గుడ్ మార్నింగ్, వియత్నాం, డెట్ పొయెట్స్ సొసైటీ, అవేకెనింగ్స్, గుడ్‌విల్ హంటింగ్ (ఇందులో నటించిన మా నసిక విశ్లేషకుడికి పాత్రకే ఆస్కార్ లభించింది), ది ఫిషర్ కింగ్, హుక్, అలాదీన్, మిసెస్ డౌట్ఫైర్ (కమల్ హసన్ నటించిన ‘భామనే సత్యభామనే’కు మాతృక), జుమాంజీ, ది బర్డ్ కేజ్, నైట్ ఎట్ ది మ్యూజియం వంటి అపురూప చిత్రాలలో రాబిన్ నటించారు. ‘హాస్యగాడు బావిలో పడినట్టు’ అని సామెత. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో పడినా, అదీ లోకానికి నవ్వులాటే. మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన రాబిన్ నిజానికి వీధిలోకి వచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనేవాడు. అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉన్నాడు. కొన్ని వారాలుగా పార్కిన్సన్స్ పెయిన్స్‌కు వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రపంచానికి ఇంత హాస్యాన్ని పంచిన రాబిన్ వ్యక్తిగత జీవితంలో కొంత చేదు లేకపోలేదు. ఒకనాడు అతడు మత్తుమందులకు బానిస. నటన మీద అభి మానం ఆ వ్యసనం నుంచి అతడిని బయటపడేసింది. చివ రికి రోగాన పడ్డాడు. కలం పట్టడం జీవితంలో ఇక సాధ్యం కాదు అన్న సంగతి తెలిశాకే ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ మి ల్లర్ హెమింగ్వే ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. చేతుల నరాలు కోసుకుని, ఉరి వేసుకున్న రాబిన్ జీవితం కూడా ఆ పంథాలోనే ముగిసిందా? ‘గుర్తుంచుకో! తాత్కాలిక సమస్య కి ఆత్మహత్య శాశ్వత పరిష్కారం’ అని 2009లో తీసిన ఒక వీడియోలో తను చెప్పిన మాటనే ఇప్పుడు రాబిన్ ఆచరించా డా? ఇది ప్రపంచాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య. నిజానికి అమోఘమైన సృజనాత్మక ప్రతిభ ఉన్న ఎం దరో సినీ నటులు ఆత్మహత్యను ఆశ్రయించడం పెద్ద విషా దం. మార్లిన్ మన్రో, ఫ్రెడ్డీ ప్రింజ్, స్పాల్డింగ్ గ్రే (హాస్యన టులు), హ్యూ ఓ కానర్, డయానా బెరీమోర్, ల్యూప్ వెలేజ్ ఇలా ఆత్మహత్యలు చేసుకున్న హాలీవుడ్ నటీనటులే. ఆ స్కార్ పురస్కారం కోసం గుమ్మం వరకు వెళ్లిన మహా ప్రతి భావంతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మరీ వింత. రిచర్డ్ ఫ్రాన్స్వర్త్, గిన్ యంగ్, చార్లెస్ బోయర్ అలాంటి వారే. డెరైక్టర్ కుర్చీలోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న గురుదత్, చేదు తప్ప జీవిత మాధుర్యం భ్రమ అనే ప్రగాఢ విశ్వాసంతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యభారతి, సిల్క్ స్మిత, జియాఖాన్, ఉదయ్‌కిరణ్ వంటివారు ఈ సంద ర్భంలో గుర్తుకు రాకుండా ఉండరు. ఇలా ఇంకా ఎందరో! వారందరి ఆత్మలకు శాంతి కలగాలని ఆశిద్దాం. కల్హణ -
మణికట్టుపై కోసుకొని, ఉరివేసుకున్న రాబిన్ విలియమ్స్
లాస్ ఏంజెలిస్: ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63)ది ఆత్మహత్యేనని మారిన్ కౌంటీ షెరిఫ్ అధికారి తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోకు సమీపంలోని టిబురోన్లోని తన ఇంట్లో విలియమ్స్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తన ఎడమచేతి మణికట్టును చిన్న చాకుతో పలుసార్లు కోసుకున్నట్లు తెలిపారు. చేతిపై రక్తపు గాట్లు ఉన్నట్లు చెప్పారు. ఆ తరువాత విలియమ్స్ బెల్టుతో ఉరి కూడా వేసుకున్నట్లు వివరించారు. విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని భార్య సునాన్ స్కీనిడెర్ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె మరో గదిలో నిద్రిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన తరువాత పనిమీద ఆమె బయటకు వెళ్లారు. తన భర్త నిద్రిస్తున్నట్లుగా ఆమె భావించారు. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఇంటి పనిమనిషి వచ్చనప్పుడు విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. రాబిన్ విలియమ్స్ ఇంతకు ముందు ఉన్న ఇంటి వద్ద, అతను నటించిన సినిమాలలో చిత్రీకరించిన ప్రదేశాలలో పూలగుచ్చాలు ఉంచి అభిమానులు నివాళులర్పించారు. బోస్టోన్స్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ఒక బెంచ్ వద్ద అతనిని స్మరిస్తూ పూలు ఉంచి నివాళులర్పించారు. గుర్తుగా ఫొటోలు కూడా తీసుకున్నారు. గుడ్‌విల్ హంటింగ్ చిత్రంలో ఒక సన్నివేశాన్ని ఇక్కడ షూట్ చేశారు. ఆఫ్గనిస్తాన్‌లో విలియమ్స్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను అతని జ్ఞాపకార్థం అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది. -
బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్
లాస్ ఏంజెలెస్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా నిర్ధారణ అయింది. బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయనేమైనా విషపదార్థాలు సేవించారా, లేదా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు. రాబిన్ విలియమ్స్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. శ్వాసావరోధం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణయిందని తెలిపారు. సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో రాబిన్ విలియమ్స్ ఆకస్మికంగా మృతిచెందారు. నిరాశ, నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా, రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటున్ని, స్నేహితున్ని కోల్పోయానని పేర్కొన్నారు. -
హాస్యనటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య!
ఒబామా, కమల్‌హాసన్ తదితరుల సంతాపం లాస్ ఏంజెలిస్: మరపురాని నటనతో కోట్లాది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఇకలేరు. ఆయన సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలియమ్స్ మధ్యాహ్నం అపస్మారకంలో ఉన్నారని తెలుసుకుని అత్యవసర వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. విలియమ్స్ శ్వాసకు అవరోధకం కల్పించుకుని, బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విలియమ్స్ కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆయన ప్రచారకర్త మారా బాక్స్బామ్ తెలిపారు. ‘గుడ్‌విల్ హంటింగ్’, ‘డెడ్ పొయెట్స్ సొసైటీ’, ‘గుడ్‌మార్నింగ్, వియత్నాం’ తదితర చిత్రాల్లో మనసు కదిలించే నటనతో విలియమ్స్ ప్రేక్షుకుల హృదయాలను గెలుచుకున్నారు. నాలుగుసార్లు ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందిన ఆయన ‘‘గుడ్‌విల్ హంటింగ్’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన తెలివైన మానసిక వైద్యుడి పాత్ర పోషించారు. భారతీయ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘అవ్వై షణ్ముగి’(తెలుగులో ’భామనే సత్యభామనే’) చిత్రం.. విలియమ్స్ చిత్రం ‘మిసెస్ డౌట్ఫైర్’ అనుకరణ. వెల్లువెత్తిన సంతాపం..: విలియమ్స్ మృతిపై హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అభిమానులు పెను విషాదంలో మునిగిపోయారు. ‘ఆయన గొప్ప హాస్యనటుడు. మానవ హృదయంలోని ప్రతికోణాన్ని స్పృశించారు. మనల్ని నవ్వించారు, ఏడిపించారు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. విలియమ్స్ మరణం గురించి బాధపడకుండా ఆయన పంచిన నవ్వులను గుర్తు చేసుకోవాలని ఆయన భార్య సుసాన్ పేర్కొన్నారు. విలియమ్స్ నాటకప్రదర్శనలు అత్యుత్తమమని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. విలియమ్స్ మగవాడి దుఃఖానికి గౌరవాన్ని సంపాదించిపెట్టారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్, షబానా ఆజ్మీ తదితర సినీ ప్రముఖులు కూడా నివాళులర్పించారు. -
రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
-
ప్రముఖ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
లాస్ ఏంజిల్స్:ప్రముఖ నటుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విలియమ్స్ సోమవారం ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని నిన్న మధ్యాహ్నం పోలీసులు ధృవీకరించారు. ఉత్తర కాలిఫోర్నియా కు సమీపంలో ఉన్న టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. అతను కొంతకాలంగా శ్వాస కోస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఆ నటుడు మానసిక క్షోభకు గురయ్యేవాడని యూఎస్ మీడియా తెలిపింది. అమెరికన్ టీవీ సిరీస్ లోనూ, హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న విలియమ్స్ ఆకస్మిక మృతి యావత్తు సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలియమ్స్ నటించిన టీవీ షోల్లో 'మోర్క్ అండ్ మైండ్' అభిమానులు హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసింది. బుల్లి తెరలపై ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విలియమ్స్ 1987 లో విడుదలైన 'గుడ్ మార్నింగ్ వియాత్నం', 1989లో 'డెడ్ పొయెట్స్ సొసైటీ', 1997 లో గుడ్ విల్ హంటింగ్ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'గుడ్ విల్ హంటింగ్' చిత్రానికి గాను ఉత్తమ సహాయనటుడి కేటగిరీలో అతని ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.