
‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన తర్వాత మోడలింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసిన నిర్మాతలు ‘చి.ల.సౌ’లో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటి వరకూ చేసిన యాడ్స్ చూపించాను. ఆడిషన్స్ చేసి, నన్ను ఎంపిక చేశారు’’ అని కథానాయిక రుహానీ శర్మ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరునీ సినీ కార్పొరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. చాలా సంప్రదాయబద్ధంగా, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది.
యాక్టింగ్‌కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలుగు రాకపోవడంతో మొదట్లో కష్టంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవటానికి హార్డ్ వర్క్ చేశా. తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని సినిమాలు చూశా. ప్రస్తుతం నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నా. సుశాంత్‌తో నటించడం సౌకర్యంగా ఉండేది. షూటింగ్ సమయంలో తను ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. మా నుంచి సరైన నటన రాబట్టుకోవడానికి రాహుల్ రవీంద్రన్ హార్డ్ వర్క్ చేశారు. పైగా రాహుల్ నటుడు కావడం వల్ల ఆయన సలహాలు మాకు ఉపయోగపడ్డాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment