గ్రామీణ నేపథ్యంలో... | Rural background movie | Sakshi
Sakshi News home page

గ్రామీణ నేపథ్యంలో...

Published Tue, Sep 13 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

గ్రామీణ నేపథ్యంలో...

గ్రామీణ నేపథ్యంలో...

 ‘వెన్నెల’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన జయతి టైటిల్ రోల్‌లో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘లచ్చి’. ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘స్టార్ హీరోలుంటేనే సినిమా హిట్ అవుతుందనే రోజులు పోయాయి.

ఎంతమంది స్టార్స్ ఉన్నా కథాబలం ఉన్న చిత్రాలే విజయవంతం అవుతాయని ఇటీవల వచ్చిన ‘పెళ్లి చూపులు’ నిరూపించింది. ఈ చిత్రం కూడా ఆ సినిమాలా హిట్ కావాలి. జయతి హీరోయిన్‌గా సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమా కోసం ఆర్నెల్లు కష్టపడ్డాం’’ అని జయతి అన్నారు. తేజశ్విని, తేజ్ దిలీప్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement