‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం | Ruslaan Mumtaz And His Wife Nirali Mehta Become Parents To Baby Boy | Sakshi

కరోనా: ఈ బేబీ సూపర్‌ హీరో!

Mar 27 2020 1:50 PM | Updated on Mar 27 2020 2:36 PM

Ruslaan Mumtaz And His Wife Nirali Mehta Become Parents To Baby Boy - Sakshi

హిందీ ప్రముఖ సీరియల్‌ ‘బాలిక వధూ’ నటుడు రుస్లాన్‌ ముంతాజ్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నిరాలి మెహతా గురువారం(మార్చి 26) మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ముంతాజ్‌ సోషల్‌ మీడియాలో శుక్రవారం ప్రకటించాడు. తాను తండ్రినయ్యాను అంటూ భావోద్యేగ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
లాక్‌డౌన్‌ : రోడ్డుపై అనుకోని అతిథి

‘అసలైతే అప్పుడే పుట్టిన బిడ్డల ఫొటోలు తీయడం కానీ బయటకు చూపించడం కానీ చేయొద్దంటారు. కానీ నా మనస్సు అత్యుత్సాహంతో ఉంది. అందుకే ఆగలేక నా కొడుకు ఫొటోలను వెంటనే షేర్‌ చేయకుండా ఉండలేకపోతున్నాను. మా ఇంటికి చోటా బేజీ వచ్చేసాడు. 3,4 నెలల తర్వాత అప్‌లోడ్‌ చేయాల్సిన నా బేబీ ఫొటోలను ఇప్పుడే షేర్‌ చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు సమయంలో ఈ వార్త మీకు కాస్తా ఆనందాన్నిస్తుందని నమ్ముతున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. (లాక్‌డౌన్‌: స‌ల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!)

అంతేగాక ‘ప్రస్తుతం ప్రపంచం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ లోకంలోకి వచ్చిన పిల్లలు.. ఓ కారణం చేతనే వస్తారన్న విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ నా చిన్న బేబీ కష్టకాలంలో జన్మించిన సూపర్‌ హీరో. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నా బిడ్డ అందంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు, నా తల్లిదండ్రులకు, నా బిడ్డకు ఈ ప్రపంచం మంచి రోజులను ఇస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను’ అంటూ హృదయపూర్వక పోస్టును పంచుకున్నాడు. (లాక్‌డౌన్‌లో ఆకలి చావులను ఆపాలంటే....)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement