Balika Vadhu Serial
-
కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్
కలర్స్ టీవీలో ప్రసారం అయిన ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సీరియల్ మంచి జనాదరణ పొందింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేర డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంత పేరు తెచ్చుకున్న సీరియల్ డైరక్టర్ ప్రస్తుతం ఓ తోపుడు బండి మీద కూరగాయలమ్ముకుంటున్నాడు. వినడానికి కాస్త బాధగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు ఇవి. వివరాలు.. బాలికా వధు సీరియల్ దర్శకుల్లో ఒకరైన రామ్ వ్రిక్ష గౌర్ ప్రస్తుతం అజంగఢ్ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ సినిమా కోసం రెక్కి నిర్వహించడానికి నేను అంజగఢ్ వచ్చాను. ఇంతలో లాక్డౌన్ విధించారు. నేను తిరిగి వెళ్లలేకపోయాను. ఇక సినిమా కూడా ఆగిపోయింది. నిర్మాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుందని తెలిపాడు. దాంతో నేను నా తండ్రి వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నాను. అందుకే ఇలా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నాను. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు’ అన్నారు రామ్ వ్రిక్ష. (చదవండి: రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి) రామ్ వ్రిక్ష తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘2002లో నా స్నేహితుడు, రచయిత షహనాజ్ ఖాన్ సాయంతో ముంబై వెళ్లాను. తొలుత లైట్ డిపార్ట్మెంట్లో పని చేశాను. తర్వాత సీరియల్ ప్రొడక్షన్ శాఖలో పనికి కుదిరాను. అలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎపిసోడ్ అండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేశాను’ అని తెలిపారు. రామ్ వ్రిక్ష.. యశ్పాల్ శర్మ, మిలింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హుడా, సునీల్ శెట్టి వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా తగ్గిన తర్వాత అతడు ఓ భోజ్‌పురి చిత్రానికి, హిందీ చిత్రానికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక ముంబైలో తనకు సొంత ఇళ్లు ఉందని.. తప్పకుండా తిరిగి వెళ్తానని అప్పటివరకు తనకు చేతనైన కష్టం చేసి పొట్టపోసుకుంటానని తెలిపారు రామ్ వ్రిక్ష. -
‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం
హిందీ ప్రముఖ సీరియల్ ‘బాలిక వధూ’ నటుడు రుస్లాన్ ముంతాజ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నిరాలి మెహతా గురువారం(మార్చి 26) మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ముంతాజ్ సోషల్ మీడియాలో శుక్రవారం ప్రకటించాడు. తాను తండ్రినయ్యాను అంటూ భావోద్యేగ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. లాక్డౌన్ : రోడ్డుపై అనుకోని అతిథి ‘అసలైతే అప్పుడే పుట్టిన బిడ్డల ఫొటోలు తీయడం కానీ బయటకు చూపించడం కానీ చేయొద్దంటారు. కానీ నా మనస్సు అత్యుత్సాహంతో ఉంది. అందుకే ఆగలేక నా కొడుకు ఫొటోలను వెంటనే షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మా ఇంటికి చోటా బేజీ వచ్చేసాడు. 3,4 నెలల తర్వాత అప్లోడ్ చేయాల్సిన నా బేబీ ఫొటోలను ఇప్పుడే షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు సమయంలో ఈ వార్త మీకు కాస్తా ఆనందాన్నిస్తుందని నమ్ముతున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. (లాక్డౌన్: సల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!) అంతేగాక ‘ప్రస్తుతం ప్రపంచం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ లోకంలోకి వచ్చిన పిల్లలు.. ఓ కారణం చేతనే వస్తారన్న విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ నా చిన్న బేబీ కష్టకాలంలో జన్మించిన సూపర్ హీరో. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నా బిడ్డ అందంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు, నా తల్లిదండ్రులకు, నా బిడ్డకు ఈ ప్రపంచం మంచి రోజులను ఇస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను’ అంటూ హృదయపూర్వక పోస్టును పంచుకున్నాడు. (లాక్డౌన్లో ఆకలి చావులను ఆపాలంటే....) View this post on Instagram 26-03-2020 : CHOTA BABY HAS ARRIVED 👶 I was going to avoid uploading any of my baby's pictures for atleast 3,4 months but given the current gloom and doom in the world right now I think news of a chota baby will only brighten your day. I genuinely do believe that babies born in times when the world is going through a rough patch come here for a reason. So I'm hoping my chota baby is a super hero born in difficult times and in time will make this world even more beautiful than he already is. I hope and pray the world becomes a better place for us, our parents and our children. A post shared by Ruslaan Mumtaz (@ruslaanmumtaz) on Mar 25, 2020 at 11:47pm PDT -
అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు
న్యూఢిల్లీ: బుల్లితెర నటి, ‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్ సహ నటుడు సిద్ధార్థ్ శుక్లా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇదివరకే ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఇది నిజమేనంటూ షీతల్ ఖండల్ తెలిపారు. వీరిద్దరూ డైలీ సోప్ అనే సీరియల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలికా వదు సీరియల్ సమయంలో అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేవాడని ఎన్ని సార్లు వారించినా వినేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పబ్లిసిటీపై ఆసక్తి లేదని తెలిపింది. సోషల్ మీడియాలో కొందరు షీతల్ హఠాత్తుగా శుక్లాను విమర్శించడానికి కారణమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, సిద్ధార్థ్ పట్ల వ్యక్తిగత ద్వేషం లేదని తామిద్దరం నటించిన సమయంలో ఆయన ప్రవర్తన గురించి మాత్రమే వివరించానని షీతల్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు అనుకున్నట్లు లైంగిక ఆరోపణలు తాను చేయలేదని స్పష్టం చేసింది. మరో బుల్లితర నటి జాస్మిన్ స్పందిస్తూ సిద్దార్థ అందరిని గౌరవించేవాడని ఈ రకమైన ఆరోపణలు తాను ఊహించలేదని తెలిపింది. కాగా, సిద్దార్థ ఎటువంటి తప్పు చేయలేదని తాను భావిస్తున్నట్లు తెలిపింది. (చదవండి : ‘బాలికా వధు ఫేం’ సిద్ధార్థ్ శుక్లాపై తీవ్ర ఆరోపణలు) -
అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్ కామెంట్స్
ముంబై : హిందీ బుల్లితెర నటి షీతల్ ఖందల్ తన సహ నటుడు సిద్ధార్థ్ శుక్లాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయాల్లో సిద్ధార్థ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వీరిద్దరు కలిసి హిందీలో బాగా పాపులర్ అయిన ‘బాలికా వధు’ సీరియలో నటించారు. హిందీలో దాదాపు 8 సంవత్సరాలపాటు కొనసాగిన ఈ సీరియల్ తెలుగులోనూ ‘చిన్నారి పెళ్లి కూతురు’గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్లో గాయత్రి పాత్ర పోషించిన షీతల్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... సిద్ధార్థ్ శుక్లాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధార్థ్ తనను సెట్లో అనేకసార్లు అనుచితంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కాగా ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లా హిందీ బిగ్‌బాస్-13లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లో ఆర్తిసింగ్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్ డేకు వ్యతిరేకంగా సిద్ధార్థ్ శుక్లా మాట్లాడటం ఆశ్చర్యంగా తనకు ఉందన్నారు. వాస్తవంగా శుక్లా తనతో ప్రవర్తించిన తీరుతో పోలిస్తే ఆర్తితో సిద్ధార్థ్ డే మాట్లాడిన మాటలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. షీతల్ మాట్లాడుతూ.. ‘‘సిద్ధార్థ్ షూటింగ్లో నాపై అసభ్యకరమైన జోకులు వేసేవాడు. నేను ఎవరితో పంచుకోలేని పదాలను సైతం నాపై ఉపయోగించాడు. తను నాతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకరోజు షూటింగ్లో అతను నన్ను తాకిన విధానం నాకు అసహ్యం కలిగించింది. నాకు అది మొదటి సీరియల్ కాబట్టి ఏం చేయలేకపోయాను. అయితే తరువాత చాలాసార్లు సీరియల్ నిర్మాతకు సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేశాను. అప్పటి నుంచి సిద్ధార్థ్ సెట్లో నాకు వ్యతిరేకంగా మట్లాడటం, నాపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. తనకు తాను గొప్ప వ్యక్తిగా అనుకునేవాడు. అంతేగాక తనకు వ్యతిరేకంగా మాట్లడిన వారందరితో కఠినంగా వ్యవహరించేవాడు. కానీ అతనికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు -
ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి
ముంబై : 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ఆనందిగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ(24) పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతమయింది. ఆమెది ఆత్మహత్యేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఊపిరి ఆడని స్థితిలో ఉక్కిరిబిక్కిరై ఆమె మరణించినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యూష తన సొంత ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో ఉన్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని పలు కథనాలు వినిపిస్తున్నాయి. ముంబై పోలీసులు రాహుల్‌ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తమ కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలుసని, ఆమె మృతి విషయమై రాహుల్ తప్పక సమాధానం చెప్పాల్సి ఉందని ప్రత్యూష తల్లి వాపోతున్నారు. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మరోపక్క ప్రియుడు రాహుల్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యూషను ఆసుపత్రికి తీసికెళ్లాక.. ఆమె మృతి చెందిందని నిర్థారణ అయిన తరువాత రాహుల్ ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. అలాగే శుక్రవారం ఇరువురు ఓ మాల్లో గొడవ పడ్డారని, ఆ సమయంలో రాహుల్ ప్రత్యూషపై చేయి చేసుకున్నాడని.. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె విగత జీవిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ చిన్న వయసులో ప్రత్యూష ఈ పరిస్థితుల్లో మరణానికి చేరువవడం పలువురిని కలచివేసింది. ప్రేమ కారణంగా అర్థాంతరంగా తనువు చాలించిన తారలను గుర్తుచేసింది. వెలుగు జిలుగుల జీవితాలను చీకటిగా మార్చేసిన 'ప్రేమ' మరోసారి వార్తల్లోకెక్కింది. అశ్రు నయనాల మధ్య ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.