
న్యూఢిల్లీ: బుల్లితెర నటి, ‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్ సహ నటుడు సిద్ధార్థ్ శుక్లా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇదివరకే ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఇది నిజమేనంటూ షీతల్ ఖండల్ తెలిపారు. వీరిద్దరూ డైలీ సోప్ అనే సీరియల్‌లో నటించిన సంగతి తెలిసిందే. బాలికా వదు సీరియల్ సమయంలో అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేవాడని ఎన్ని సార్లు వారించినా వినేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పబ్లిసిటీపై ఆసక్తి లేదని తెలిపింది. సోషల్ మీడియాలో కొందరు షీతల్ హఠాత్తుగా శుక్లాను విమర్శించడానికి కారణమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కాగా, సిద్ధార్థ్ పట్ల వ్యక్తిగత ద్వేషం లేదని తామిద్దరం నటించిన సమయంలో ఆయన ప్రవర్తన గురించి మాత్రమే వివరించానని షీతల్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు అనుకున్నట్లు లైంగిక ఆరోపణలు తాను చేయలేదని స్పష్టం చేసింది. మరో బుల్లితర నటి జాస్మిన్ స్పందిస్తూ సిద్దార్థ అందరిని గౌరవించేవాడని ఈ రకమైన ఆరోపణలు తాను ఊహించలేదని తెలిపింది. కాగా, సిద్దార్థ ఎటువంటి తప్పు చేయలేదని తాను భావిస్తున్నట్లు తెలిపింది.
(చదవండి : ‘బాలికా వధు ఫేం’ సిద్ధార్థ్ శుక్లాపై తీవ్ర ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment