తమిళసినిమా: సినిమా వాళ్లు ఎప్పుడూ తమ గురించే మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి ముఖ్యంగా అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఓ మంచి మాట చెబుదాం అనే ఆలోచన రాదు. ఎందుకంటే సెలబ్రిటీలైన వారి మాటలైనా, చేష్టలైనా సాధారణ ప్రజలపై చాలా ప్రభావం చూపుతాయన్నది నిజం. అలా నటి శ్రద్ధాకపూర్ ప్రజలకు ఓ మంచి మాట చెప్పారు. పలు హిందీ చిత్రాల్లో నటించి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రద్ధాకపూర్‌లో మంచి నటితో పాటు, గాయని, గీతరచయిత ఉన్నారు. ఈ బ్యూటీ పలు చిత్రాలకు పాడారు. పాటలు రాశారు. సాహో చిత్రంతో టాలీవుడ్, కోలీవుడ్‌లకు పరిచయం కానున్నారు. బాహుబలి సీరిస్ తరువాత నటుడు ప్రభాష్ నటిస్తున్న త్రిభాషా చిత్రం సాహో.
భారీ ఎత్తున్న తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న సాహో చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. శద్ధాకపూర్ ఆదివారం తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోండి. అయితే పటాసులు కాల్చి భూమండలాన్ని పొగమండలంగా మాత్రం మార్చకండి. అది అందరి ప్రాణాలకు చెడు కలిగిస్తుంది అంటూ ఒక మంచి మాటతో హితవుపలికారు.
ఆమె చెప్పిన ఓ మంచి మాట!
Published Wed, Oct 18 2017 3:28 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment