
దుబాయ్‌లో దుమ్ము లేచిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు ‘సాహో’ టీమ్. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో రూపొందిన ఈ ఎనిమిది నిమిషాల సీన్ కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు చేశారట చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. దుబాయ్ షెడ్యూల్ తర్వాత ఇండియాలో నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తారట.
వచ్చే నెలాఖర్లో హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారమ్. ప్రభాస్‌తో పాటుగా సినిమాలోని ముఖ్య తారలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. సాంగ్ షూట్స్‌ని కూడా ప్లాన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అరుణ్ విజయ్, నీల్‌నితిన్ ముఖేష్, ఎవెలిన్ శర్మ, మలయాళ నటుడు పాల్ తదితరులు నటిస్తున్నారు. ‘సాహో’ చిత్రానికి శంకర్–ఇషాన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment