
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల చిత్రలహరి, ప్రతిరోజూ పండగే.. వంటి విజయాలను సొతం చేసుకున్న మోగా మేనల్లుడు ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. తాజాగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. (సాయిధరమ్ తేజ్ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్)
సోలో సోదర సోదరీమణులారా...ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం...మన slogan ఒకటే...సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼 #SBSBFromMay1st @SVCCofficial @MusicThaman @NabhaNatesh @subbucinema #solobrathukesobetter pic.twitter.com/bDCgGzk1wL
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2020
‘సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలెంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్ ఒకటే. సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ విడుదల అయిన న్యూ లుక్ ద్వారా కార్మికుల దినోత్సవం రోజు 2020 మే1న మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే వాలెంటైన్స్ వీకెండ్‌లో ఈ మూవీలోని సోలో బ్రతుకే సోబెటర్ థీమ్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది.
ఇప్పటి వరకు ఫ్యామిలీ మూవీస్‌ను టార్గెట్ చేసిన తేజ్ ఇప్పడు యూత్‌ను అట్రాక్ట్ చేసే దిశగా వెళ్తున్నట్లు కన్పిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కూడా సోలో సోదర సోదరీమణులారా అంటూ అదిరిపోయే స్లోగన్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులంతా ’ ఇక రోజులు లెక్కబెట్టుకోండి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ వచ్చేస్తోంది.’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment