
మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు... తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ... ఆమెకున్న అభిమానులు ఎక్కువే. ప్రస్తుతం సాయి పల్లవి పలు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా.. ఓ డబ్బింగ్ చిత్రంతో త్వరలోనే పలకరించనుంది.
తెలుగు ప్రేక్షకుల కోసం మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘అథిరన్’ను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కాగా.. ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అనువదిస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నామని, త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment