సారీ చెప్పిన సాయి పల్లవి | Sai Pallavi Says Sorry To Fans | Sakshi
Sakshi News home page

సారీ చెప్పిన సాయి పల్లవి

Published Fri, May 31 2019 1:31 PM | Last Updated on Fri, May 31 2019 1:31 PM

Sai Pallavi Says Sorry To Fans - Sakshi

కోలీవుడ్ టాలీవుడ్‌ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ రోజు ఎన్జీకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య హీరోగా సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సూర్యతో పాటు సాయి పల్లవి కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

అయితే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో మాట్లాడాలని భావించారు. కాసేపట్లో మీతో ఆస్క్‌ సాయి పల్లవి(#AskSaiPallavi) ట్యాగ్ అభిమానుల ప్రశ్నలను ట్వీట్ చేయాలంటూ కోరారు. చాలా కాలం తరువాత సాయి పల్లవి సోషల్‌ మీడియాలో చాట్ చేయటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తమ ప్రశ్నలను ట్వీట్ చేశారు.

అయితే సాయి పల్లవి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీంతో చాలా సమయం వెయిట్ చేసిన కొందరు అభిమానులు నువ్వు చీట్ చేశావు. మా ప్రశ్నలకు రిప్లై ఇవ్వలేదు అంటూ కామెంట్‌ చేశారు. దీంతో సాయి పల్లవి అభిమానులకు సారీ చెప్పారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలపై ఆలస్యంగా స్పందించిన ఆమె ‘నేను సమధానం చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు’ అంటూ క్షమాపణలు కోరారు. తరువాత కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement