మండి: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పిత వివాహ రిసెప్షన్లో డాన్స్ చేసి ఆహుతులను అలరించారు. అర్పిత భర్త ఆయుష్ శర్మ సొంతూరయిన హిమాచల్ ప్రదేశ్లోని మండిలో సోమవారం రిసెప్షన్ జరిగింది. సల్మాన్ తన తల్లి సల్మా, సోదరుడు సొహైల్తో కలసి ఇక్కడికి వచ్చారు.
నవంబర్లో అర్పితకు కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనువడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనిల్ శర్మ కొడుకు ఆయుష్ శర్మతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత అర్పిత, ఆయుష్ తొలిసారి మండికి వెళ్లారు. అర్పిత మామ అనిల్ శర్మ రిసెప్షన్ను గ్రాండ్గా ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేలమందికి పైగా ఈ కార్యక్రమానికి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రుచులు ఆరగించిన సల్మాన్ డాన్స్ చేసి హుషారెత్తించారు. వేదిక వద్ద 4 గంటల పాటు గడిపిన సల్మాన్ స్థానికులతో ముచ్చటించారు. చెల్లెలు వివాహం అయిన తర్వాత మండితో భావోద్వేగమైన అనుబంధం ఏర్పడిందని అన్నారు. తన ప్రాణానికి ప్రాణమైన అర్పితను అత్తారింట్లో అప్పగించేందుకు వచ్చానని సల్మాన్ చెప్పారు.
చెల్లి వివాహ రిసెప్షన్లో చిందేసిన సల్మాన్
Published Mon, May 25 2015 8:28 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
Advertisement
Advertisement