arpita
-
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే: అర్పితా ముఖర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో భాగంగా ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్ సీ, గ్రూప్ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్ లెటర్స్ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి. వెస్ట్ మేదినీపూర్ ఓ స్కూల్ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా, అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్ ఎయిమ్స్ ప్రకటించింది. కాగా, మంత్రి, అర్పితలను ఆగస్ట్ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది. -
Arpita Mukherjee: వహ్వా.. గౌహర్ జాన్ పాత్రలో జీవించిన అర్పిత!
ప్లేబ్యాక్సింగర్గా పరిచితమైన అర్పిత ముఖర్జీ పరకాయ ప్రవేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు! కాని రంగస్థలంపై లెజండరీ సింగర్ గౌహర్ జాన్ పాత్రలో జీవించిన తీరు చూస్తే ఆమెకు పరకాయ ప్రవేశం వచ్చునని కాస్త సరదాగా అనుకోవచ్చు. గౌహర్ జాన్ జీవితంపై రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ జాన్’ ప్లేలో అర్పిత ముఖర్జీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నటన–నాట్యం– గానం మేళవింపు ఈ ప్లే. పాపులర్ ఓల్డ్ బెంగాలీ సాంగ్స్, పంజాబీ టప్పా, గుజరాత్ క్లాసికల్... ఒకటా రెండా కనుల విందుకు తోడు వీనుల విందు! ‘రంగస్థల గౌహర్ జాన్’ను చూసే ఇంత అబ్బురపడుతున్న ప్రేక్షక సమూహాలకు వాస్తవజీవితంలోని వ్యక్తి కళ్ల ముందు నిలిస్తే ఎంత అపురూపమో కదా అనిపిస్తుంది. ఈ తరానికి బొత్తిగా పరిచయం లేని పేరు... గౌహర్ జాన్. తొలితరం గ్రామ్‌ఫోన్ రికార్డ్ సింగర్ గా ప్రసిద్ధురాలైన గౌహర్ జాన్ ఎన్నో భాషల్లో 700 పాటలు పాడి ‘ది గ్రామ్‌ఫోన్ గర్ల్’ ‘ది ఫస్ట్ రికార్డింగ్ సూపర్‌స్టార్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. భారతీయ భాషల్లోనే కాదు అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్.. మొదలైన భాషల్లోనూ పాటలు పాడి మెప్పించింది. ఈకాలంలో గౌహర్జాన్ను గుర్తు చేసుకోవడం అంటే... ఒక గాయని వ్యక్తిగతజీవితం తెలుసుకోవడం కాదు. చరిత్ర లోతుల్లోకి వెళ్లడం. ఆకాలంలో ప్రతిభావంతులైన మహిళలు ఎన్నెన్ని కష్టాలను భరించి, ఆ కష్టాలకు వెరవకుండా, లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నతస్థాయికి ఎలా చేరారో తెలుసుకోవడం. గౌహర్ జాన్ 1873లో ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించింది జాన్. ఇంజనీర్ రాబర్ట్ యెవర్డ్, గాయని, నృత్యకారిణి ఎలెన్ విక్టోరియా హెలెన్‌లకు జన్మించిన ఏంజెలినా యెవర్డ్ ‘గౌహర్ జాన్’గా గొప్ప పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగడం వరకు నడిచింది నల్లేరుపై నడక కాదు. ముళ్ల కంచెపై ప్రయాణం. గొంతులో దాగిన విషయాన్ని కప్పిపెట్టి...అమృతంలాంటి పాటలు పాడింది. కాళ్లకు గుచ్చుకున్న ముండ్లను తీసేసి... అపురూపమైన నృత్యం చేసింది. ఒకానొకరోజు మిస్టర్ రాబర్ట్ భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఉన్న ఊరు నుంచి పొట్ట చేతపట్టుకొని బిడ్డను తీసుకొని బెనారస్‌కు వెళ్లింది విక్టోరియా. అక్కడ ఖుర్షీద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూతురి పేరుని ‘గౌహర్ జాన్’గా మార్చింది. ఈ పేరుతోనే కాకుండా ‘మల్కా జాన్’గా కూడా ప్రసిద్ధురాలైంది ఏంజెలినా. ప్రముఖ ఆడియో కంపెనీ ఒకటి గౌహర్ జాన్ ఆణిముత్యాలను రీ–రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉంది. రేపో మాపో బాలీవుడ్లో గౌహర్ జాన్ బయోపిక్ వార్త కూడా వినవచ్చు! చదవండి: Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ -
మూడేళ్ల తర్వాత అన్నం ముద్ద
వేములవాడ: వేములవాడ రాజన్ననే నమ్ముకుని మూడేళ్లపాటు అన్నం ముట్టకుండా దీక్ష చేపట్టిన డాక్టర్ (డెంటల్) అనుమోలు అర్పిత శుక్రవారం దీక్షను విరమించారు. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరులో ప్రాక్టీస్ చేస్తున్న అర్పిత.. వేములవాడ రాజన్నకు అన్నపూజ నిర్వహించిన అనంతరమే దీక్ష విరమిస్తానని మూడేళ్ల క్రితం మొక్కుకున్నట్లు చెప్పారు. శుక్రవారం సోదరి అపర్ణ, స్నేహితురాలు మంజులతో కలసి వేములవాడకు వచ్చారు. స్వామివారికి అన్నపూజ నిర్వహించిన తర్వాత భోజనం చేశారు. తన కుటుంబం బాగుకోసం రాజన్నకు మొక్కుకుని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. మూడేళ్లపాటు పండ్లు, ఇతర పదార్థాలు స్వీకరించినట్లు తెలిపారు. తిరువూరులోనే పిల్లల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న తన భర్త నాగభూషణం, ఇద్దరు కుమారులు అఖిల్రాజు, ఆకాశ్ సైతం తన దీక్షకు మద్దతు ప్రకటించారని ఆమె సంతోషంగా చెబుతున్నారు. -
చెల్లి వివాహ రిసెప్షన్లో చిందేసిన సల్మాన్
మండి: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పిత వివాహ రిసెప్షన్లో డాన్స్ చేసి ఆహుతులను అలరించారు. అర్పిత భర్త ఆయుష్ శర్మ సొంతూరయిన హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో సోమవారం రిసెప్షన్ జరిగింది. సల్మాన్ తన తల్లి సల్మా, సోదరుడు సొహైల్‌తో కలసి ఇక్కడికి వచ్చారు. నవంబర్‌లో అర్పితకు కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనువడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనిల్ శర్మ కొడుకు ఆయుష్ శర్మతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత అర్పిత, ఆయుష్ తొలిసారి మండికి వెళ్లారు. అర్పిత మామ అనిల్ శర్మ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేలమందికి పైగా ఈ కార్యక్రమానికి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రుచులు ఆరగించిన సల్మాన్ డాన్స్ చేసి హుషారెత్తించారు. వేదిక వద్ద 4 గంటల పాటు గడిపిన సల్మాన్ స్థానికులతో ముచ్చటించారు. చెల్లెలు వివాహం అయిన తర్వాత మండితో భావోద్వేగమైన అనుబంధం ఏర్పడిందని అన్నారు. తన ప్రాణానికి ప్రాణమైన అర్పితను అత్తారింట్లో అప్పగించేందుకు వచ్చానని సల్మాన్ చెప్పారు. -
సల్మాన్ షూటింగ్‌కు ఊహించని అతిథి
కాశ్మీర్: అసలే ఎండాకాలం.. కానీ అక్కడ మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది మంచు ప్రాంతం. కాశ్మీర్ మిగతా ప్రాంతాలకన్నా ఎప్పటికీ ఆహ్లాదంగానే ఉంటుంది కూడా. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మాత్రం కాస్త చిరాకుగా, ఒత్తిడిగా అనిపించింది. అలా అనిపించేలోపే తిరిగి గాల్లో తేలిపోయినట్లు ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. ముఖంలో చిరునవ్వు. ఒత్తిడి మాయం. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా..! ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బజ్రంగి భైజాన్ కాశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటోంది. చుట్టూ నటీనటులు, కెమెరాలు, మైక్ సౌండ్లతో కాస్తంత అలసి పోయిన సల్మాన్ వెంటనే రిలీఫ్ అయ్యారు. అందుకు కారణం ఆయన గారాల చెల్లెలు అర్పిత, బావ అయూష్ శర్మ అనుకోకుండా షూటింగ్ వద్దకు వచ్చారంట. దీంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు కనిపించడంతోపాటు తాను ఎంతగానో ఇష్టపడే సోదరి అర్పిత ఊహించకుండా వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయారని, అక్కడ చిరునవ్వులు విరబూసాయని అర్పిత ట్వీట్ చేసింది. -
సంగీత అప్సెట్!
బ్యాండ్ బాజా బారాత్‌తో మతిపోయేలా సోదరి అర్పిత పెళ్లి చేసినా... సల్మాన్‌కు ఇంకా తల బొప్పి కడుతూనే ఉంది. కారణం... గెస్ట్స్ లిస్ట్‌లో కొందరి పేర్లు లేకపోవడం. గిట్టక కొందరిని... గుర్తు లేక మరికొందరిని లిస్ట్‌లో చేర్చని సల్మాన్‌ను ఇప్పుడా సెగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. షారూఖ్‌తో మళ్లీ దోస్తానీ కుదిరి ఓ పక్క ఆనందిస్తుంటే... కావల్సిన వారిని పిలవడం మరచిన గోల మరో పక్క షేక్ చేస్తోంది. తాజాగా ఈ లిస్టులో ఒకప్పటి మనోడి ప్రియురాలు, బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంగీతా బిజిలానీ చేరింది. అతగాడితో కలసి పెళ్లి షాపింగ్ కూడా చేసిన తనను ఎలా పిలవరంటూ సల్మాన్ ఫ్యామిలీని సంగీత నిలదీసిందట పెళ్లి రిసెప్షన్లో. -
వారిద్దరూ అలా!
బాలీవుడ్, టాలీవుడ్ తారలతో ఫుల్ ప్యాక్ అయిన సల్మాన్ సోదరి అర్పితా వివాహ మహోత్సవంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ పెళ్లి సందర్భంగా బద్ధ శత్రువులుగా ఉన్న షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్లు మళ్లీ ఒక్కటయ్యారు. ఈ ఆనందంలో మరో విచారం... బీ-టౌన్ భామలు కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలు ఎడమొహం పెడమొహంగా ఉండటం. ఎదురు పడినా ఇద్దరూ ఒకరికొకరు పలకరించుకోలేదట. కబీర్‌ఖాన్, మినిమాధూర్లతో కత్రినా కాలక్షేపం చేస్తే... తన ఫ్రెండ్స్‌తో ప్రియాంక గడిపిందట! -
వెడ్డింగ్ ప్యాలెస్
-
సల్మాన్ సోదరి వివాహ విందులో ఘుమ ఘమలు!
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ ఏర్పాట్లు నగరంలోని ఫలక్ నామా హోటల్ లో ఊపందుకున్నాయి. వివాహంలో పాల్గొనే అతిధులకు ఘుమఘమలాడే వంటకాలను వడ్డించేందుకు 'హైదరాబాద్ బిర్యానీ', 'హలీమ్', 'పత్తర్ కా ఘోష్' లాంటి పత్యేక వంటకాలు వడ్డించడానికి అంతా సిద్దమైంది. బాలీవుడ్ ఇతర చిత్రరంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ వేత్తల కోసం నవంబర్ 18, 19 తేదిల కోసం హోటల్ మొత్తం బుక్ చేశారు. హోటల్ వద్ద ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతిధులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. 18న జరిగే ప్రధాన విందు కోసం అన్ని వంటకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆయుష్ శర్మతో జరిగే వివాహ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ వి సత్యనారాయణకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. -
ఫలక్‌నుమా ప్యాలెస్ లో హీరో సోదరి పెళ్లి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్ నుమా ప్యాలస్ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ధ్రువీకరించారు. అర్పిత వివాహం ఏడాది జనవరిలో జరగనుంది. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదని సలీమ్ ఖాన్ తెలిపారు. 'మేము చాలా కూల్‌గా వివాహ వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. అందుకు ఫలక్‌నూమా ప్యాలెస్ ను వేదికగా ఎన్నుకున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్ రాలేదు. ఫలక్‌నూమా వండర్ఫుల్ వెన్యూ కావటంతో అందరం అంగీకరించాం' అని సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పిత... ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మ లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఆమోదం తెలపటంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లిని ముస్లిం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికూతురుతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులు ...ఫలక్ నూమా ప్యాలెస్‌ను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు సమాచారం. కాగా అత్యంత ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు జరిపించే సంపన్నులు ఈ మధ్య కాలంలో ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవటం విశేషం.