సుల్తాన్కు జోడిగా బుల్బుల్ | salman khan finally found the leading lady for the film sulthan | Sakshi
Sakshi News home page

సుల్తాన్కు జోడిగా బుల్బుల్

Published Thu, Dec 24 2015 1:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

సుల్తాన్కు జోడిగా బుల్బుల్

సుల్తాన్కు జోడిగా బుల్బుల్

ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్, నెక్ట్స్ సినిమా సుల్తాన్. హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజలర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను 2016 ఈద్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో సల్మాన్కు జోడిగా నటించనున్న హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఈ క్యారెక్టర్ కోసం పరిణితీ చోప్రా, కంగనారనౌత్, దీపికాపదుకొనే లాంటి టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించిన చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. జీ టివిలో ప్రసారం అవుతున్న కుంకుం భాగ్య సీరియల్లో బుల్బుల్ పాత్రలో నటిస్తున్న మృణాల్ థాకూర్ను సుల్తాన్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశారట. ఇప్పటికే కుంకుంభాగ్య సీరియల్ చేయటం ఆపేసిన మృణాల్ బాలీవుడ్ వెండితెర మీద సందడి చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement