Sulthan
-
డిజప్పాయింట్ అయిన రష్మిక.. ఎందుకిలా?
తక్కువ సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిన అతికొద్ది మందిలో రష్మిక మందన్నా ఒకరు. ఛలో సినిమాలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు కొట్టిన్నర వరకూ పారితోషికం తీసుకునే రేంజ్‌కి వెళ్లింది ఈ కన్నడ బ్యూటీ. టాలీవుడ్లో రష్మికకు ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని ఈమె నటించిన కన్నడ చిత్రాలు కూడా ఇక్కడ డబ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘పొగరు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్లాప్ అయినప్పటికీ రష్మిక ఇమేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇక ఇటీవల రష్మిక నుంచి వచ్చిన మరో డబ్బింగ్ చిత్రం ‘సుల్తాన్’. తమిళంలో రష్మికకు తొలి చిత్రం ఇది. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో రష్మిక డిజప్పాయింట్ అయింది. కోలీవుడ్లోకి కూడా స్టార్ హీరోయిన్గా రానిద్దామకున్న ఆమె కలలు ఆవిరైపోయింది. సుల్తాన్ కచ్చితంగా హిట్ అవుంది. ఇక కోలీవుడ్‌లో బోలెడు ఆఫర్లు వస్తాయని రష్మిక ఆశపడింది. అంతేకాదు సుల్తాన్ మూవీ షూటింగ్లో ఉండగానే విజయ్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆ చాన్స్‌ని పూజా హెగ్డే కొట్టేసింది. అయినా రష్మిక పెద్దగా ఫీలవలేదు. సుల్తాన్ హిట్ అయితే అవకాశాలు అవే వస్తాయని భావించింది. కానీ సుల్తాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో రష్మిక తెగ ఫీలవుతుందట. మరో మంచి కథను ఎంచుకొని కోలీవుడ్‌లో హిట్ కొట్టాలని భావిస్తుందట. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ సినిమా చేస్తుంది. అక్కడ ఆమెకు ఇదే తొలి సిసిమా. మరి బాలీవుడ్లో రష్మిక డెబ్యూ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. -
’సుల్తాన్‌కు పైరసీ షాక్! రేయ్ నా ట్విట్టర్లోనే పోస్ట్ చేస్తారా?
చెన్నై: ‘నా ట్విట్టర్లోనే పోస్ట్ చేస్తారా.. ఇదిగో వస్తున్నారా..’? అంటూ సుల్తాన్ చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలను పైరసీ బెడద నుంచి కాపాడడం అసాధ్యంగానే మారింది. కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆ చిత్రం చట్టవిరుద్ధంగా వెబ్సైట్లో ప్రసారమవుతుంది. దీన్ని అరికట్టాలని చూసిన ఎవరి ప్రయత్నం కూడా ఫలించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే నటుడు కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రానికి సక్సెస్ టాక్ రావడంతో ఖుషీలో ఉన్న చిత్ర యూనిట్ ఓ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగులుతోంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్విట్టర్లోనే ఒక వ్యక్తి సుల్తాన్ చిత్రం తన టెలిగ్రామ్ చానల్లో పొందుపరచడం జరిగిందని పోస్ట్ చేశాడు. దీంతో షాక్‌కు గురైన నిర్మాత ఎస్ ఆర్.ప్రభు అనంతరం రేయ్ ట్విట్టర్లోకే వచ్చి నా చిత్ర పైరసీకి ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారా? ఇదిగో వస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సంఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: సుల్తాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. యావరేజ్ టాక్ అయినా కూడా.. Adeiii.... yen comment la vanthu en padaththukke piracy promote pandra alavukku valanthutteengala😂😂😂 Itho varandaaa....🤣🤣🤣 https://t.co/UogtsCBBBY — SR Prabhu (@prabhu_sr) April 4, 2021 -
సుల్తాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. యావరేజ్ టాక్ అయినా కూడా..
కార్తీ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుల్తాన్’.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు.. లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్) కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (ఏప్రిల్ 02)న విడుదలైన ఈ చిత్రానికి టాలీవుడ్లో యావరేజ్ టాకే వచ్చింది. అయినప్పటికీ.. మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మొదటి రోజే ఈ చిత్రం రూ. 1.20 కోట్ల షేర్ ను రాబట్టి టాలీవుడ్లో కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉందని నిరూపించింది. నైజాంలో 0.42 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.14 కోట్లు, ఈస్ట్, వేస్ట్‌లో 0.10, 0.08 కోట్లు, కృష్ణ 0.12 కోట్లు, నెల్లూరులో రూ. 0.06కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సుల్తాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం 1.20 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో 5.30 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టే అని చెప్పాలి.అయితే ఈ లక్ష్యాన్ని కార్తి ఛేదిస్తాడా అనేది ఈ వారాంతంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: ‘సుల్తాన్’ మూవీ రివ్యూ జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు! -
‘సుల్తాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : సుల్తాన్ జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు తదితరులు నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు : యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు దర్శకత్వం : బక్కియరాజ్ కణ్ణన్ సంగీతం : వివేక్- మెర్విన్ ఎడిటర్: రూబెన్ సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ విడుదల తేది : ఏప్రిల్ 02,2021 తమిళ హీరో కార్తీకి టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కార్తీ గత చిత్రం ‘ఖైదీ’ తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆయన ‘సుల్తాన్’గా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హంగామా చేయడానికి వచ్చాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ నటించిన తాజా చిత్రం ఇది. రష్మిక మందన్న హీరోయిన్. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్) కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు అంచనాలను కూడా పెంచాయి. మరి ఆ అంచనాలను ‘సుల్తాన్’ అందుకున్నాడా? కార్తీ, రష్మికా మందన్నా జంట ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం. కథ విక్రమ్ సుల్తాన్(కార్తీ) ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజనీర్. ఆయన తండ్రి సేతుపతి(నెపోలియన్)మాత్రం ఒక డాన్. తన దగ్గర కౌరవులుగా పిలవబడే 100మంది రౌడీలు ఉంటారు. సుల్తాన్‌కు మాత్రం రౌడీయిజం అంటే అసలు నచ్చదు. కానీ అనుకోని సంఘటన వల్ల ఆయన సోదరులుగా భావించే 100 మంది రౌడీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సుల్తాన్ తన 100 మంది సోదరులతో కలిసి అమరావతిలోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు. అక్కడ రుఖ్మిణి(రష్మికా మందన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అదే రుక్మిణి ఉన్న గ్రామానికి ఓ పెద్ద సమస్య ఉందని తెలుసుకొని, దానిని పరిష్కరిస్తాడు. అసలు ఆ గ్రామానికి ఉన్న సమస్య ఏంటి? 100 మంది బాధ్యతను సుల్తాన్ ఎందుకు తీసుకున్నాడు? కార్తీ తన కౌరవులతో ఏం చేశాడు? అనేదే మిగతా కథ. నటీనటులు ఎప్పుడూ ప్రయోగాత్మక కథలను ఎంచుకునే కార్తీ.. ఈ సారి కూడా ఓ విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సుల్తాన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అదరగొట్టింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో రష్మికను చూడొచ్చు. హీరో తండ్రి పాత్రలో నెపోలియన్ తన అనుభవాన్ని చూపించాడు. విలన్ పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా మంచి నటనను కనబరిచాడు. ఇక యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్ తీసుకుని ‘సుల్తాన్’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ బ్యాక్ డ్రాప్నే నేటి తరానికి కావాల్సిన అంశాలు పెట్టి తెరపై చూపించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం ఫుల్ కామెడీగా నడిపించిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటం ప్రేక్షకుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. 'కేజీఎఫ్' ఫేమ్ రామ్ లాంటి స్టార్ విలన్ ఉన్నప్పటికీ.. వారి పాత్రని బలంగా తీర్చిదిద్దలేకపోవడం ప్రతికూల అంశమే. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా లాజిక్ మిస్ అవుతుంది. కానీ, కార్తీ, రష్మిక మధ్య వచ్చే లవ్ సీన్స్ అదిరిపోయాయి. తెరపై వారిద్దరి కెమెస్ట్రీ బాగా కుదురింది. వివేక్ – మెర్విన్ల పాటలు, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ రూబెన్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
సుల్తాన్ సినిమాలో అవన్నీ ఉన్నాయి
‘‘మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్ తీసుకుని ‘సుల్తాన్’ సినిమా చేశాం. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే ఈ చిత్రం’’ అని కార్తీ అన్నారు. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్నా జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ – ‘‘నా ‘ఖైదీ’ చిత్రంలో ఉన్న యాక్షన్, ‘ఊపిరి’లో ఉన్న కామెడీ, ‘ఆవారా’లో ఉన్న లవ్‌స్టోరీ, రొమాన్స్.. అన్నీ ‘సుల్తాన్’లో ఉన్నాయి. ‘వైల్డ్‌డాగ్’ సినిమాతో పాటు మా ‘సుల్తాన్ ’ కూడా విజయం సాధించాలని కోరుకున్న మా అన్నయ్య నాగార్జునగారికి ధన్యవాదాలు. నాగార్జునగారిలా విభిన్నమైన సినిమాలు చేయడం కష్టం’’ అని అన్నారు. ‘‘నేను డైరెక్ట్ చేసిన ‘ఊపిరి’ సినిమాలో నాగార్జునగారు, కార్తీ నటించారు. ఐదేళ్ల తర్వాత వీరి సినిమాలు ఒకే రోజున (ఏప్రిల్ 2) విడుదలవుతున్నాయి. ‘వైల్డ్‌డాగ్’, ‘సుల్తాన్’... ఈ రెండు సినిమాలు సక్సెస్ కావాలని కోరు కుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. చాలామంది తెలుగు హీరోలకు నేను అభిమానిని. ‘సుల్తాన్’ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్’’అన్నారు దర్శకుడు. ‘‘సుల్తాన్’ సినిమాలో ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఆర్. ప్రభు. ‘‘సుల్తాన్’ పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ . ‘‘తమిళంలో ‘సుల్తాన్’ నా తొలి సినిమా. కాస్త నెర్వస్‌గా, ఎగ్జయింటింగ్‌గా ఉంది’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘నిర్మాత ఎస్.ఆర్. ప్రభు కాన్సెప్ట్ ఓరియంటెండ్ సినిమాలనే నిర్మిస్తారు. ‘ఖైదీ’, ‘ఖాకీ’లే అందుకు ఓ ఉదాహరణ. ‘సుల్తాన్’ కూడా హిట్ అవుతుంది’’ అన్నారు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ‘వరంగల్’ శీను. -
'సుల్తాన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
అన్నయ్య, నేను కలిసి నటించడానికి సిద్ధం: కార్తీ
‘‘ఒక్క అన్నయ్య ఉంటేనే గొడవపడుతుంటాం.. అలాంటిది వంద మంది అన్నయ్యలుంటే? అనే పాయింట్ ఆసక్తిగా అనిపించింది. ఈ వంద మంది రౌడీ అన్నయ్యలు ఆర్నెళ్లపాటు ఏం చేయకుండా చూసుకోవాలని నాన్న చెప్పాక నా పరిస్థితి ఏంటి? అన్నదే ‘సుల్తాన్’ కథ’’ అని హీరో కార్తీ అన్నారు. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు. బక్కియరాజ్ కణ్ణన్ ‘సుల్తాన్’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. రెండేళ్లు కష్టపడి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశారాయన. తల్లితండ్రులు, పిల్లల మధ్య భావోద్వేగాలతో కూడిన సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి.. వస్తున్నాయి. కానీ వంద మంది అన్నయ్యలు, ఓ తమ్ముడి మధ్య భావోద్వేగాలు ఆసక్తికరంగా ఉంటాయి. 101 మందితో సన్నివేశాలు తెరకెక్కించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నటీనటులు, యూనిట్ మెంబర్స్‌తో ప్రతిరోజూ ఓ పండగ వాతావరణం ఉండేది. ఈ సినిమా నాకు కొత్త అనుభూతినిచ్చింది. ∙సినిమాలో రోబోటిక్స్ ఇంజినీర్ అయిన నేను ముంబయ్ నుంచి పల్లెకు ఎందుకొచ్చాను? ఏం చేశాను? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. బాగా చదువుకుని గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఊరిలోని వారికి సహాయం చేసే పాత్ర రష్మికది. ఈ సినిమాలో వ్యవసాయం నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. వ్యవసాయం ఇంత కష్టంగా ఉంటుందా? అన్నారామె. బక్కియరాజ్ కణ్ణన్ ఎంతో ఓపికతో అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ‘సుల్తాన్’కి ఓటీటీలో విడుదలకు అవకాశం వచ్చినా థియేటర్లలోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్. ఇది ఇంట్లో కూర్చుని చూసే సినిమా కాదు. థియేటర్లోనే చూడాలి. మంచి కథ కుదిరితే అన్నయ్య (సూర్య), నేను నటించడానికి సిద్ధం. తెలుగులో ‘ఊపిరి’ అవకాశం ఇచ్చిన నాగార్జున సార్‌కి, వంశీ పైడిపల్లిగారికి థ్యాంక్స్. మంచి కథ కుదిరితే తెలుగులో మళ్లీ డైరెక్ట్ సినిమా చేయాలని ఉంది. మణిరత్నంగారి దర్శకత్వంలో చేస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ 70శాతం పూర్తయింది. మిస్కిన్ తోనూ ఓ సినిమా చేస్తున్నాను. లాక్డౌన్ తర్వాత తెలుగులో సినిమాలు బాగా ఆడుతున్నాయి.. మంచి వసూళ్లు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ వల్లే అన్ని ఇండస్ట్రీల వారికీ ఓ నమ్మకం వచ్చింది. నాకు తెలిసి 2022లో కోవిడ్ నేపథ్యంలో వంద సినిమాలు వస్తాయనుకుంటున్నా (నవ్వుతూ). లాక్డౌన్లో మాకు బాబు పుట్టాడు. నాకు సంప్రదాయబద్ధంగా ఉండే పేర్లంటే ఇష్టం. అందుకే బాబుకి ‘కందన్’ అని పెట్టాను. కందన్ అంటే కార్తికేయ స్వామి అని అర్థం. మా ఫ్యామిలీలో మా అందరికీ ఆయన పేరే ఉంటుంది. -
లైన్ వినగానే ఓకే అన్నారు
‘‘తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. వీటిలో ఉన్న కమర్షియాలిటీ ఇష్టం. దర్శకులు రాజమౌళిగారికి పెద్ద అభిమానిని. ‘బాహుబలి’ని లెక్కలేనన్నిసార్లు చూశాను’’ అన్నారు బక్కియరాజ్ కణ్ణన్ . కార్తీ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సుల్తాన్ ’. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బక్కియరాజ్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో శివ కార్తీకేయన్ నటించిన ‘రెమో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఈ చిత్రం తెలుగులోనూ మంచి సక్సెస్ సాధించింది. దర్శకుడిగా నా రెండో చిత్రం ‘సుల్తాన్ ’. ఇందులో రొబోటిక్స్ ఇంజినీర్ పాత్రలో కార్తీ కనిపిస్తారు. జస్ట్ స్టోరీ లైన్ విని, ఆయన ఓకే చెప్పేశారు. తన వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండే మనస్తత్వం కలిగిన హీరో వందమంది వ్యక్తులతో జీవనం సాగించాల్సి ఉంటుంది. వీరి వల్ల హీరో జీవితం ఎలా ప్రభావితం అయ్యింది అన్నదే ‘సుల్తాన్ ’ కథ. కార్తీ, రష్మికా మధ్య సన్నివేశాలు క్యూట్ అండ్ ఫ్రెష్‌గా ఉంటాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో రామచంద్రరాజు చేసిన గరుడ క్యారెక్టర్ చూసి, ఈ సినిమాలో నెగటివ్ రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేశాం. సినిమా అన్నివర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది’’ అన్నారు. -
రౌడీలయితే భయపడాలా : రష్మిక
కార్తి, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో రష్మిక లంగావోణిలో అచ్చం పల్లెటూరీ అమ్మాయిగా కనిపిస్తుంది. రౌడీలయితే భయపడాలా ? అంటూ రష్మిక, ‘వందమంది రౌడీలను మేనేజ్ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది’ అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుంటుంది. 100 మంది రౌడీలు ఉన్న ఓ స్థానంలోకి కార్తి వెళ్తాడు. అక్కడ వాళ్లతో కలిసిపోయి.. వాళ్లను ఎలా కాపాడాడు.. ఎలా మార్చాడు అనేది సుల్తాన్ కథ. ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటుడు నెపోలియన్, లాల్, యోగిబాబు, కేజీఎఫ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: మహేశ్ న్యూ పిక్: ఎంత ముద్దొస్తున్నాడో.. షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు! -
సుల్తాన్ టీజర్: యుద్ధం లేకుండా మహాభారతం?!
కార్తీ, రష్మికా మందన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్’. సోమవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజైంది. పనిలో పనిగా రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించింది. 'మహాభారతం చదివావా?' అన్న డైలాగ్‌తో సుల్తాన్ టీజర్ మొదలవుతుంది. "మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు, అదే కౌరవుల వైపు ఉండుంటే? అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి" అని చరిత్రను తిరగరాసి చెప్తున్నాడు హీరో కార్తీ. కౌరవుల పక్షాన కృష్ణుడు నిల్చోవడం అన్న కాన్సెప్టే కొత్తగా ఉందిక్కడ. ఇక ఈ టీజర్లో కార్తీ పశువులను మేపుతూ, ట్రాక్టర్ నడుపుతూ, యాక్షన్ సీన్లలో ఫైటింగ్ చేస్తూ కనిపించాడు. (చదవండి: వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు) అలాగే రక్తమోడుతున్న ఒకరి చేయి పట్టుకుని ఏదో మాటిస్తున్నట్లు కనిపించింది. హీరోయిన్ రష్మిక పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. యాక్షన్, లవ్, సెంటిమెంట్, డ్రామా ఇలా అన్ని అంశాలను రంగరించినట్లుగా ఉన్న ఈ టీజర్ అభిమానులను ఆకర్షిస్తోంది. షూటింగ్ పూర్తైన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భాగ్య రాజ్ కన్నన్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్ఆర్ ప్రభు, యస్ఆర్ ప్రకాష్ నిర్మించారు. తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. కార్తీ అంతకు ముందు నటించిన ఖైదీ, దొంగ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. (చదవండి: కోలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అవుతున్న రష్మిక) -
నమ్మలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్ ట్వీట్
రష్మిక మందన్నా.. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్. ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు త్వరలోనే తమిళ తెరపై కూడా మెరవనుంది. కార్తీ హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్’ లో ఈ అమ్మడు నటించింది. ఇది తమిళంలో తనకు మొదటి సినిమా. సోమవారం విడుదలైన 'సుల్తాన్' ఫస్ట్‌లుక్ పోస్టర్ షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది రష్మిక. (చదవండి : కార్తీకి జోడిగా..సుల్తాన్ ఫస్ట్‌లుక్ రిలీజ్) ‘ చిన్నప్పటి నుంచి నాన్న, నేను కలిసి చాలా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేకపోతున్నా. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. ఇందుకు నేను కృతజ్ఞురాలిని’ అని రష్మిక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా, . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. -
కోలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అవుతున్న రష్మిక
హీరో కార్తికి జంటగా రష్మిక మందన్నా నటిస్తున్న 'సుల్తాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. మూడేళ్ల క్రితం కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సినిమాపై అదే ఎక్సయిట్మెంట్ ఉందని హీరో కార్తీ అన్నాడు. తన కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ ప్రొడక్షన్‌గా చెప్పుకొచ్చాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. (మరోసారి తండ్రి అయిన కార్తీ ) ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో రశ్మిక తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. చిన్నప్పటి నుంచి తమిళ చిత్రాలు చూసి పెరిగిన నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని నటి రష్మిక అన్నారు. సుల్తాన్ టీంతో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా 'ఛలో' సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రష్మిక తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో హీరో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తున్నారు. (రోజూ ఆమ్లెట్ ఉండాల్సిందే: రష్మిక ) Dear brothers and sisters, Your love and appreciation is what keeps us going! Bringing you the first look of #Sulthan. Hope you like it! Love you guys! #SulthanFirstLook pic.twitter.com/9dkfwmBdo0 — Actor Karthi (@Karthi_Offl) October 26, 2020 -
సుల్తాన్ పూర్తి
కార్తీ, రష్మికా మందన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి భాగ్య రాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. యస్ఆర్ ప్రభు, యస్ఆర్ ప్రకాష్ నిర్మించారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. తమిళంలో రష్మికకు ఇది తొలి చిత్రం. ‘సినిమా చిత్రీకరణ పూర్తయింది. మూడేళ్ల క్రితం ఈ కథ విన్నప్పటి నుంచి ఇవాళ్టి దాకా కూడా అదే ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాను. నిర్మాణంపరంగా నేను నటించిన పెద్ద సినిమాల్లో ఇదొకటి. సినిమా పూర్తి చేయడానికి సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు’ అన్నారు కార్తీ. -
అర్థమవుతోంది!
‘మీకు అర్థమవుతుందా’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మికా మందన్నా తెగ సందడి చేసింది. ‘ఛలో’తో తెలుగు తెరపై కనిపించినప్పుడే ఈ కన్నడ బ్యూటీ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకటి అవుతుందని చాలామందికి అర్థమైంది. గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మహేశ్‌తో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’తో టాప్ లీగ్‌లోకి వెళ్లిపోయింది రష్మికా. నెక్ట్స్ అల్లు అర్జున్ సరసన కూడా సినిమా చేయబోతోంది. ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలో నటిస్తోంది. ఇలా తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రష్మికా ఈ ఏడాది తమిళ తెరకు కూడా పరిచయం కాబోతోంది. కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సూర్య సరసన ఓ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందని టాక్. సూర్యతో ‘సింగమ్’ వంటి హిట్ సిరీస్ తీసిన హరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మికా నటించనుందట. ఇటు తెలుగులో స్టార్ హీరోలతో చేస్తూ దూసుకెళుతోన్న రష్మికా అటు తమిళంలోనూ ఆ దూకుడు మీదే ఉన్నారని అర్థమవుతోంది కదూ. -
సూపర్‌స్టార్ సినిమా.. 11వేల స్ర్కీన్స్.. 40వేల షోలు..
బాలీవుడ్ కండల వీరుడు, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలన్ని బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తుంటాయి. 2016లో వచ్చిన ‘సుల్తాన్’ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా ఏంటో చూపించింది ఈ సినిమా. చైనాలో ఇండియాన్ సినిమాల జోరు కొనసాగుతోంది. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయిజాన్, హిందీ మీడియం సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. మళ్లీ ఇప్పుడు చైనా బాక్సాఫీస్‌పై దూకడానికి సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాను చైనాలో ఆగస్టు 31న విడుదల చేయనున్నుట్లు ప్రకటించారు. ఈ సినిమా చైనాలో 11వేల స్ర్కీన్స్‌లో విడుదల చేయనున్నట్లు.. రోజుకు 40వేల షోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ‘సుల్తాన్’ టైటిల్‌తోనే ఈ సినిమా చైనాలో విడుదల కానుంది. #Sultan releases in China on 31 Aug 2018... Some info... * Will release in over 11,000 screens. * Targeting around 40,000 shows every day. * The film will release with the same title: #Sultan. Here are three new posters for the local audiences in China: pic.twitter.com/AucUL41chq — taran adarsh (@taran_adarsh) August 6, 2018 -
సుల్తాన్ ఆట మొదలెట్టాడు
బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నెక్ట్స్ సినిమా టీజర్ వచ్చేసింది. ప్రేమ్ రతన్ ధన్ పాయోతో కాస్త నిరాశపరిచిన సల్మాన్, ఈ సారి తన మార్క్ మాస్ క్యారెక్టర్లో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ రెజలర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సల్మాన్ లుక్కు మంచి రెస్పాన్స్ రాగా.., తాజాగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సల్మాన్‌కు మంచి రికార్డ్ ఉన్న ఈద్ సీజన్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుల్తాన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు సల్మాన్. ఈ టీజర్ తో ఈద్ సీజన్ ను టార్గెట్ చేస్తూ సల్మాన్ ఆట మొదలెట్టినట్టే అంటున్నారు ఫ్యాన్స్. -
'నేనా సినిమా చేయట్లేదు' : కృతిసనన్
'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ కృతి సనన్, తరువాత నాగచైతన్య సరసన దోచెయ్ సినిమాలోనూ నటించింది. సౌత్ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాక బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి అవకాశాలనే పట్టేసింది. షారూక్ ఖాన్ లీడ్ రోల్ తెరకెక్కిన దిల్వాలే సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా కూడా కృతిని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. సక్సెస్ సంగతి ఎలా ఉన్న కృతి సనన్ పేరు మాత్రం బాలీవుడ్లో మారుమోగిపోతుంది. దిల్వాలే సినిమా తరువాత ఈ పొడుగు కాళ్ల సుందరి.. సల్మాన్ హీరోగా నటిస్తున్న సుల్తాన్ సినిమాలో నటించడానికి అంగీకరించిందంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆ సినిమా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ పెట్టిన కండీషన్స్ నచ్చక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ వినిపించింది. దీంతో ఎన్నడూ లేనిది యష్ రాజ్ ఫిలింస్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా కృతి సనన్ కూడా ఈ రూమర్స్‌పై స్పందించింది. 'నేను మరోసారి మీకో విషయంలో క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నాకు సుల్తాన్ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. కాబట్టి యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశమే లేదు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో సుల్తాన్ హీరోయిన్ కృతీనే అంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. I'd like to clarify again that I have not been offered Sultan. So the question of YRF putting any conditions doesn't arise. — Kriti Sanon (@kritisanon) December 24, 2015 -
సుల్తాన్‌కు జోడిగా బుల్బుల్
ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్, నెక్ట్స్ సినిమా సుల్తాన్. హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజలర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను 2016 ఈద్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో సల్మాన్‌కు జోడిగా నటించనున్న హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ క్యారెక్టర్ కోసం పరిణితీ చోప్రా, కంగనారనౌత్, దీపికాపదుకొనే లాంటి టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించిన చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. జీ టివిలో ప్రసారం అవుతున్న కుంకుం భాగ్య సీరియల్లో బుల్బుల్ పాత్రలో నటిస్తున్న మృణాల్ థాకూర్‌ను సుల్తాన్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశారట. ఇప్పటికే కుంకుంభాగ్య సీరియల్ చేయటం ఆపేసిన మృణాల్ బాలీవుడ్ వెండితెర మీద సందడి చేయటం ఖాయంగా కనిపిస్తోంది. -
11 గంటల్లో సినిమా షూటింగ్ పూర్తి
ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి చిత్రం తప్పా యోసిక్కాదీంగ. సోమవారం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో పూర్తి చేసుకుంది. జి.అనిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సుల్తాన్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈయన ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి. ఎవిఎం సంస్థలో 13 సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. తెండ్రల్ సీరియల్ ఫేమ్ రాజా హీరోగా నటిం చిన ఈ చిత్రంలో జ్యోతిషా, సనీల హీరోయిన్లుగా నటించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక యువకుడు తాత్కాలికంగా చేసే ఉద్యోగాన్ని కోల్పోతే తన కుటుంబంలో ఎదురయ్యే వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉం టాయి, చివరికి వాటిని ఎలా ఎదుర్కొన్నారన్న అంశాల సమాహారంగా ఉంటుందన్నారు. అదే విధంగా ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే చిత్రంగా తప్ప యోసిక్కాదీంగ (తప్పుగా ఆలోచించకండి) చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని 11 గంటల్లో రూపొందించడానికి పగడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. నటీనటులతో ముందుగా పలుమార్లు రిహార్సిల్స్ చేయించినట్లు వెల్లడించారు. 11 గంటల్లో పూర్తి చిత్రం టాకీ పార్టుతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణం గురించి దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేయడంతో తాను నిర్మాణానికి సిద్ధం అయ్యానని అయితే చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించి తానేమిటో నిరూపించుకున్నానని నిర్మాత జి.అనిల్‌కుమార్ తెలిపారు.