సూపర్‌స్టార్‌ సినిమా.. 11వేల స్ర్కీన్స్‌.. 40వేల షోలు.. | Salman Khan Sultan Movie Will Be Released In China On 31st August | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 6:18 PM | Last Updated on Mon, Aug 6 2018 6:19 PM

Salman Khan Sultan Movie Will Be Released In China On 31st August - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు, సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సినిమాలన్ని బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టిస్తుంటాయి. 2016లో వచ్చిన ‘సుల్తాన్‌’ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సల్మాన్‌ స్టామినా ఏంటో చూపించింది ఈ సినిమా. 

చైనాలో ఇండియాన్‌ సినిమాల జోరు కొనసాగుతోంది. దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, భజరంగీ భాయిజాన్‌, హిందీ మీడియం సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. మళ్లీ ఇప్పుడు చైనా బాక్సాఫీస్‌పై దూకడానికి సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’  సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాను చైనాలో ఆగస్టు 31న విడుదల చేయనున్నుట్లు ప్రకటించారు. ఈ సినిమా చైనాలో 11వేల స్ర్కీన్స్‌లో విడుదల చేయనున్నట్లు.. రోజుకు 40వేల షోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ‘సుల్తాన్‌’ టైటిల్‌తోనే ఈ సినిమా చైనాలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement