సుల్తాన్ ఆట మొదలెట్టాడు | salman khan sulthan first look teaser | Sakshi
Sakshi News home page

సుల్తాన్ ఆట మొదలెట్టాడు

Published Tue, Apr 12 2016 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

సుల్తాన్ ఆట మొదలెట్టాడు

సుల్తాన్ ఆట మొదలెట్టాడు

బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నెక్ట్స్ సినిమా టీజర్ వచ్చేసింది. ప్రేమ్ రతన్ ధన్ పాయోతో కాస్త నిరాశపరిచిన సల్మాన్, ఈ సారి తన మార్క్ మాస్ క్యారెక్టర్లో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ రెజలర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సల్మాన్ లుక్కు మంచి రెస్పాన్స్ రాగా.., తాజాగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేశారు.
 
సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సల్మాన్కు మంచి రికార్డ్ ఉన్న ఈద్ సీజన్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుల్తాన్ ఫస్ట్ లుక్ టీజర్ను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు సల్మాన్. ఈ టీజర్ తో ఈద్ సీజన్ ను టార్గెట్ చేస్తూ సల్మాన్ ఆట మొదలెట్టినట్టే అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement