
కరీనాతో సల్మాన్
‘బాడీగార్డ్’లో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో చేసిన కరీనా కపూర్, మరోసారి అతడితో నటించనుంది. ‘బజరంగి భాయిజాన్’ చిత్రంలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. సల్మాన్ తన ‘సల్మాన్ వెంచర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ‘ఈద్’ పర్వదినం సందర్భంగా విడుదల కానుంది. దర్శకుడు కబీర్‌ఖాన్ ఈ విషయాన్ని ‘ట్విట్టర్’ ద్వారా వెల్లడించాడు.