
ఖాన్‌దాన్-కరీనాజ్ఞాన్
ఆమీర్‌ఖాన్ పక్కనుంటే... మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా అనిపిస్తుంది!... సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులేస్తే.. సూపర్ పెయిర్‌లా కనిపిస్తుంది!... షారూక్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేస్తే... లైక్‌ల మీద లైక్‌లు కొట్టాలనిపిస్తుంది! ఈ ఖాన్‌లు ముగ్గురే!... కానీ, ఈ ఖాన్ త్రయానికే బ్యూటీ తెచ్చిన బ్యూటీ మాత్రం ఒక్కరే! ఆమే కరీనా కపూర్‌ఖాన్... బాలీవుడ్‌లో హాటెస్ట్, స్వీటెస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్... ఈ ముగ్గురితో బ్రహ్మాండంగా మ్యాచ్ అయిన హీరోయిన్ ఎవరంటే? కరీనా అనే చెప్పాలి. ‘ఖాన్’పౌండ్‌తో క్లోజ్‌గా మసిలే కరీనా ఈ ముగ్గురి ఖాన్‌ల గురించి ఏం చెప్పారో మీరే చదవండి.
సల్మాన్ హార్ట్ సో స్వీట్
సల్మాన్ ఖాన్‌ని చాలామంది ఇష్టపడతారు. దానికి కారణం ఆయన ముక్కుసూటితనం. ఎవరికైనా సహాయం చేయాలన్నప్పుడు వెనకా ముందూ ఆలోచించరు. అందుకే సల్మాన్‌ది స్వీట్ హార్ట్ అనాలనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూల్‌గానే ఉంటారు. పక్కన పిడుగుపడినా లైట్ తీసుకునేంత కూల్ అన్నమాట. నటుడిగా చెప్పాలంటే ఆయన సూపర్ స్టార్. షాట్ గ్యాప్‌లో అదే పనిగా సీన్ గురించి ఆలోచిస్తూ, కూర్చోరు. కెమెరా ముందుకి వెళ్లడం, అప్పటికప్పుడు నటించడం ఆయన స్టయిల్. సల్మాన్ గొప్ప స్టార్ కాబట్టి, నేనాయన పక్కన నటించాలనుకోను. ఆయనంటే నాకు గౌరవం. ఆయన సరసన నేను కథానాయికగా చేసిన ‘క్యూంకీ’, ‘మై ఔర్ మిసెస్ ఖన్నా’, ‘బాడీ గార్డ్’, ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. సల్మాన్‌తో నా బంధం ఓ నటుడికీ, నటికీ మధ్య ఉండేది కాదు. అంతకు మించి. నన్ను లోలో (కరీనా అక్క కరిష్మా) చెల్లెలిగా ట్రీట్ చేస్తాడు. కరిష్మా, సల్మాన్ మంచి స్నేహితులు. ఆ విధంగా నేను కూడా ఆయనకు దగ్గరయ్యాను. నేనంటే సల్మాన్‌కి చాలా అభిమానం. నాక్కూడా అంతే.
ఆమిర్ లివింగ్ లెజెండ్
ఆమిర్ ఖాన్ లివింగ్ లెజెండ్. నేను ఆయనకు వీరాభిమానిని. ఆమిర్ అంటే బోల్డంత ఇష్టం కూడా. ఆ విషయం మా ఆయన సైఫ్ అలీఖాన్‌కి కూడా తెలుసు. ఆమిర్ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. తన కారణంగా ఎవరూ ఇబ్బందిపడకూడదనుకునే మనస్తత్వం ఆయనది. నటుడిగా ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనకాడరు. షూటింగ్ లొకేషన్లో ఆమిర్ కూల్‌గానే ఉంటారు కానీ, చేయబోయే సీన్ గురించి బాగా ఆలోచిస్తారు. నిత్య విద్యార్థిలా కనిపిస్తారాయన. పరీక్షకు వెళుతున్నప్పుడు ఉండే టెన్షన్ సీన్ తీసే ముందు ఆయనలో కనిపిస్తుంది. ఆమిర్‌తో నటించిన ‘3 ఇడియట్స్’, ‘తలాష్’ మాకు ‘హిట్ పెయిర్’ అనే పేరు తెచ్చాయి.
షారూక్ లవ్లీ పర్సన్
షారూక్ ఖాన్‌తో నాకు ‘అశోక’ మొదటి సినిమా. మల్టీస్టారర్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్’లో మేం ఇద్దరం జంటగా నటించలేదు. ఆ ఎవర్ గ్రీన్ మూవీలో నేను హృతిక్ రోషన్‌కి జోడీ అయితే షారూక్‌కి కాజోల్ జోడీ అనే విషయం తెలిసిందే. కానీ, మేం ఇద్దరం ఉన్న ఆ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నిలిచిపోయింది. ఇక, ‘డాన్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో నాది స్పెషల్ అపియరెన్స్ అయినప్పటికీ చాలా పేరొచ్చింది. ‘రా. వన్’ చిత్రంలో మా జంట కనువిందుగా ఉంటుంది. షారూక్ లవ్లీ పర్సన్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది. నటన విషయంలో అస్సలు రాజీపడరు. బెటర్‌మెంట్ కోసం ట్రై చేస్తుంటారు. అది చాలా ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది.