ఇప్పుడూ అదే కోరుకుంటున్నా: సమంత | samanth about upcoming Films | Sakshi
Sakshi News home page

ఇప్పుడూ అదే కోరుకుంటున్నా: సమంత

Published Tue, Nov 21 2017 10:11 AM | Last Updated on Tue, Nov 21 2017 10:11 AM

samanth about upcoming Films - Sakshi

అద్భుత అధ్యాయం ఇప్పుడే ఆరంభమైందని నటి సమంత పేర్కొన్నారు. బానాకాత్తాడి అనే తమిళ చిత్రంతో నటిగా తెరపైకి వచ్చిన సమంత ఆ తరువాత ఏమాయ చేశావే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.  ఆ సినిమా సాధించిన విజయం సమంతకు నటిగా ఉన్నత స్థానాన్ని అందించింది. ఆ తరువాత నటిగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఈ బ్యూటీకి లేకపోయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్‌ హీరోలతో జత కట్టి స్టార్‌ ఇమేజ్‌ను అందుకున్నారు. 

అలా తొలి తెలుగు చిత్రం ఏమాయచేశావే చిత్ర షూటింగ్‌ సమయంలోనే ఈ చెన్నై చిన్నది టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల అనుమతితో ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా సమంత రూత్‌ప్రభు ఇంటి పేరు మారి సమంత అక్కినేనిగా తెలుగింటి కోడలయ్యారు. విశేషం ఏమిటంటే చాలా మంది హీరోయిన్లు పెళ్లి తరువాత కొంతకాలం నటనకు విరామం ఇస్తారు. నటి సమంత మాత్రం పెళ్లి అయిన వారం లోపే నటించడానికి రెడీ అయిపోయారు.

అలా చేతినిండా చిత్రాలున్న నటి కూడా ఈ బ్యూటీనే అవుతారు. ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో రంగస్థలం 1985, నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న మహానటి, తమిళంలో విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, విజయ్‌సేతుపతితో అనీతికథైగళ్, శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ బిజీబిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇచ్చిన ఒక భేటీలో తన జీవితంలో నటిగా అద్భుత అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నానని అన్నారు. వివాహానికి ముందు కత్తి, తేరి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించానని, ఇప్పుడు కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి తన ప్రతిభను నిరూపించుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement