చిక్కుల్లో చిన్నోడు! | Samantha about Anirudh ravincadar's engagement | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో చిన్నోడు!

Published Tue, Nov 22 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

చిక్కుల్లో చిన్నోడు!

చిక్కుల్లో చిన్నోడు!

నిజంగా నిశ్చితార్థం జరిగిందో? లేదో? గానీ సమంత సెటైర్ మాత్రం ఓ కుర్రాణ్ణి చిక్కుల్లో పడేసింది. అసలు వివరాల్లోకి వెళితే... ‘వై థిస్ కొలవెరి డి’ - ఈ పాటకీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవించదర్‌కీ ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘3’ సినిమాలో ఈ పాట పాడుకునే కుర్రాడి లవ్ ఫెయిల్యూర్ గానీ, రియల్ లైఫ్‌లో అనిరుధ్ లవ్ సూపర్‌హిట్ అట! ఇటీవలే ప్రేయసితో రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిందని చెన్నై కోడంబాక్కమ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఆనోటా ఈనోటా చక్కర్లు కొట్టిన ఈ పుకారు అనిరుధ్ చెవిన పడింది. దాంతో ‘ఐయామ్ సింగిల్. నేనింకా చిన్నోణ్ణే. అప్పుడే నిశ్చితార్థమా?’ అని ట్వీట్ చేశారు.

వెంటనే సమంత సీన్‌లోకి ఎంటరయ్యారు. ‘తను మంచి అమ్మాయే కదా! షి ఈజ్ ఎ స్వీట్ గాళ్. ఏమైంది?’ అని ట్విట్టర్ వేదికగా అనిరుధ్‌ను సమంత అడిగారు. దాంతో జనాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ‘అనిరుధ్ నిశ్చితార్థం జరిగే ఉంటుంది’ అని మాట్లాడుకుంటు న్నారు. అనిరుధ్ ఫ్రెండ్స్‌లో సమంత కూడా ఒకరు కావడంతో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్య చర్చకు దారి తీసింది. ఏంటో ఈ మధ్య ప్రేమ వార్తలు ఎక్కడున్నా సమంత చటుక్కున ప్రత్యక్షమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement