Anirudh ravinchadar
-
'అరబిక్ కుతు' తెలుగు వెర్షన్ వచ్చేసింది.. విన్నారా..!
Telugu Version Of Arabic Kuthu Halamithi Habibo From Beast Released: తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ ఎంత క్రేజ్ సంపాందించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా ఈ సాంగ్‌కు తెలుగు వెర్షన్ వచ్చింది. ఇప్పటివరకు తమిళ్లో అదరగొట్టిన ఈ పాట తెలుగులోనూ అలరించనుంది. కోలీవుడ్ సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. ఈ తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించగా తమిళ వెర్షన్లో హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. భాష, ఆ పదాలు అర్థం కాకపోయినా పదాల క్యాచీగా ఉండటం, విజయ్, పూజా హెగ్డె స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
విజయ్ దేవరకొండ సినిమాకి 'అరబిక్ కుతు' కంపోజర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత టక్ జగదీష్ డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంత నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రం కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోనునున్నారట. ఇదే నిజమైతే మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే అరబిక్ కుతుతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో మోస్ట్ వ్యూస్ రాబట్టిన సాంగ్‌గా అరబిక్ కుతు నిలిచింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
తలపతి తదుపరి చిత్ర దర్శకుడు నెల్సన్
చెన్నె : కోలీవుడ్ సూపర్‌స్టార్ తళపతి విజయ్ నటించనున్న 65 వ చిత్రానికి దర్శకుడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నట్లు సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’తో హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో విజయ్ జోడిగా నయనతార నటించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కె చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు సమకుర్చనున్నాడు. కాగా చిత్ర దర్శకుడు నెల్సన్ సినిమాకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నా తదుపరి చిత్రం విజయ్‌తో చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం 2021 సంక్రాతికి విడుదలకు సిద్ధంగా ఉంది. -
చిక్కుల్లో చిన్నోడు!
నిజంగా నిశ్చితార్థం జరిగిందో? లేదో? గానీ సమంత సెటైర్ మాత్రం ఓ కుర్రాణ్ణి చిక్కుల్లో పడేసింది. అసలు వివరాల్లోకి వెళితే... ‘వై థిస్ కొలవెరి డి’ - ఈ పాటకీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవించదర్కీ ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘3’ సినిమాలో ఈ పాట పాడుకునే కుర్రాడి లవ్ ఫెయిల్యూర్ గానీ, రియల్ లైఫ్‌లో అనిరుధ్ లవ్ సూపర్‌హిట్ అట! ఇటీవలే ప్రేయసితో రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిందని చెన్నై కోడంబాక్కమ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఆనోటా ఈనోటా చక్కర్లు కొట్టిన ఈ పుకారు అనిరుధ్ చెవిన పడింది. దాంతో ‘ఐయామ్ సింగిల్. నేనింకా చిన్నోణ్ణే. అప్పుడే నిశ్చితార్థమా?’ అని ట్వీట్ చేశారు. వెంటనే సమంత సీన్లోకి ఎంటరయ్యారు. ‘తను మంచి అమ్మాయే కదా! షి ఈజ్ ఎ స్వీట్ గాళ్. ఏమైంది?’ అని ట్విట్టర్ వేదికగా అనిరుధ్‌ను సమంత అడిగారు. దాంతో జనాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ‘అనిరుధ్ నిశ్చితార్థం జరిగే ఉంటుంది’ అని మాట్లాడుకుంటు న్నారు. అనిరుధ్ ఫ్రెండ్స్‌లో సమంత కూడా ఒకరు కావడంతో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్య చర్చకు దారి తీసింది. ఏంటో ఈ మధ్య ప్రేమ వార్తలు ఎక్కడున్నా సమంత చటుక్కున ప్రత్యక్షమవుతున్నారు.