ఆ పత్రికపై.. సమంతకు కోపం వచ్చింది | samantha ruthprabhu reacts sharply on fashion comments by english daily | Sakshi
Sakshi News home page

ఆ పత్రికపై.. సమంతకు కోపం వచ్చింది

Published Tue, Jul 1 2014 11:35 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

ఆ పత్రికపై.. సమంతకు కోపం వచ్చింది - Sakshi

ఆ పత్రికపై.. సమంతకు కోపం వచ్చింది

దీపికా పడుకోన్, సోనమ్ కపూర్ల స్టైలును సమంత కాపీ కొడుతోందంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంపై సమంత మండిపడింది. ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహం మొత్తాన్ని వెళ్లగక్కింది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది ట్వీట్లు ఇచ్చేసి చివర మాత్రం పొద్దున్నే తన ట్వీట్లతో విసిగించినందుకు సారీ అంటూ తన ఫాలోయర్లకు క్షమాపణలు చెప్పింది. ట్వీట్లలో సమంతా ఏం చెప్పిందంటే...

''డియర్ టీవోఐ, నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలచుకున్నాను, ప్రాథమికంగా టీవోఐ కార్యాలయాల్లో మనకున్న సోకాల్డ్ ఫ్యాషనిస్టులను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా డిజైనర్లు ఓ కలెక్షన్ తీసుకొచ్చేటప్పుడు వాళ్లు ఆ సీజన్కు సంబంధించి ఒక కలర్ పేలెట్ను ఎంపిక చేసుకుని ఒకేలాంటి దుస్తులు డిజైన్ చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు ఎప్పుడూ కొన్ని 'కీ పీసెస్' చేసుకుంటాయి. అనామికా ఖన్నా ధోతీ, అర్పిత కట్ వర్క్ బ్లౌజ్ ఇలాంటివే. ఇవి కేవలం ఒకే ఒక్క సెలబ్రిటీ కోసం ఒక్క పీస్ మాత్రమే తయారుచేయరు. అవి దుకాణాల్లోను, ఆన్లైన్లోను దొరుకుతాయి. స్టైలింగ్ అంటే ఒకేలాంటి దుస్తులు వేసుకోగలగడం లేదా మనకు కావల్సినవి దానికి కలుపుకోవడం.

ఈ అద్భుతమైన డిజైనర్లందరి గురించి నేను తెలుసుకోవాలని నేను ఎంచుకుంటే అందులో టైమ్స్ సమీక్షించాలని నిర్ణయించుకోడానికి, ఆనందించడానికి ఏముందో నాకు కనపడటంలేదు. పింక్ విల్లా, మిస్ మాలిని.. వీళ్లంతా చాలాసార్లు ఫ్యాషన్ మేధావుల గురించి, ఫ్యాషన్ డిజాస్టర్ల గురించి రాస్తారు. వాళ్లు నా లుక్స్ను అనేకసార్లు సమీక్షించారు. అన్నిసార్లూ పొగిడారు. ఉన్నట్టుండి టైమ్స్ పత్రిక మన కొత్త ఫ్యాషన్ సమీక్షకురాలిగా ఎప్పుడు మారిపోయిందో నాకు గుర్తులేదు. ఒకరి ఫ్యాషన్ను కాపీచేసినట్లు ఆరోపిస్తున్నారు. ఫ్యాషన్ అంటే ఫన్. టీవోఐ లాంటి పేరున్న సంస్థ తన మొదటి పేజీల కోసం మెరుగైన ప్రమాణాలు పాటిస్తుందని ఆశిస్తున్నా.

కొసమెరుపు: థాంక్స్ ఫర్ ద పబ్లిసిటీ (ప్రచారం చేసినందుకు కృతజ్ఞతలు)
వరుసపెట్టి ట్వీట్లు ఇచ్చినందుకు సారీ. ఇదంతా తెల్లవారుజామున వచ్చే పిచ్చి''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement