హారర్ థ్రిల్లర్‌లో మామా కోడళ్లు?
అల్రెడీ అక్కినేని కుటుంబంలో హీరోలు ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్... అందరూ ‘మనం’లో కనిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు. అందులో అక్కినేని కోడలు అమల అతిథిగా కనిపించారు. బహుశా... ఇటీవల కాలంలో అక్కినేని హీరోలు అండ్ కోడలు ఓ సినిమాలో కనిపించడం అదే మొదటిసారి. ‘మనం’లో ఓ హీరోయిన్‌గా నటించిన సమంత త్వరలో అక్కినేని ఇంట్లో అడుగు పెట్టనున్నారు. సమంత మెడలో నాగచైతన్య మూడు ముడులు వేసిన తర్వాత అధికారికంగా ఆమె నాగార్జున కోడలు అవుతారు.
ఇప్పుడీ మామాకోడళ్లు ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించనున్నారట! నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది–2’లో సమంత కీలక పాత్ర చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్త. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. ఒకవేళ సమంత ఈ సినిమాలో నటిస్తే.. ఆమె ఏ పాత్రలో కనిపిస్తారు? అనేది చూడాలి. సినిమాలోనూ నాగ్, సమంత మామాకోడళ్లుగా కనిపిస్తారా? వెయిట్ అండ్ సీ.