
సమంత విన్నర్, చైతూ లూజర్
చాలా కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన సమంత, నాగచైతన్యలు ఇప్పుడు అన్ని విషయాలు పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా ప్రకటించిన ఈ జంట గతంలో తాము దిగిన ఫోటోలను ఇప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంత ట్వీట్ చేసిన ఓ ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
పివి సింధు ఒలింపిక్ మెడల్ సాధించడానికి ముందు.. సమంత చైతూలు బాడ్మింటన్ ఆడుతున్నప్పుడు తీసిన ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన సామ్. ఈ ఫోటో మీద సమంత విన్నర్, చైతూ లుజర్ అంటూ రాసి ఉంది. ఫోటోతో పాటు ' పివి సింధు మనల్ని ఇన్స్పైర్ చేయటానికి ముందు' అంటూ కామెంట్ చేసింది. సమంత ట్వీట్ పై ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారులు గుత్తా జ్వాలా, పివి సింధులు కూడా స్పందించటం విశేషం.
Bu ha ha ha ha 🙃🙃 That time when @Pvsindhu1 got us inspired . pic.twitter.com/QNzcRelyQa
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 12 October 2016