ఉమేశ్ భనకర్
ప్రస్తుతం అందర్నీ టెన్షన్‌లో పడేస్తోన్న వైరస్ కరోనా. అయితే కరోనాలో ఓ కథాంశంను చూశారు కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్. కరోనా వైరస్‌పై సినిమా చేస్తున్నట్టు ప్రకటించారాయన. ఈ సినిమాకు ‘డెడ్లీ కరోనా’ (భయంకరమైన కరోనా) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారు. దీన్ని ప్యాన్ ఇండియా సినిమాగా తీయాలని భావిస్తున్నారట ఉమేశ్. ‘‘కరోనా వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది? దాని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంది? వంటి అంశాలను మా సినిమాలో చూపించనున్నాం’’ అన్నారు ఉమేశ్.
Comments
Please login to add a commentAdd a comment